Begin typing your search above and press return to search.
మోడీకి సవాల్ చేసిన ఐఎస్ఐఎస్
By: Tupaki Desk | 17 July 2015 5:04 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఘట్టి సవాల్ ఎదురైంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ ఆండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు జమ్ముకాశ్మీర్‌లో తమ ఉనికి ఏంటో నిరూపించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతుండగానే శ్రీనగర్‌లో వేర్పాటువాదులు తామెంత పొగరుబోతులమో నిరూపించుకుంటూ జెండాలు ఎగురవేశారు.
రంజాన్ చివరి శుక్రవారం అయిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ముస్లింలు జమాత్ ఉల్ విదా ప్రార్ధనలు ముగించుకున్న తర్వాత అల్లరిమూకలు తొలుత పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అనంతరం కొందరు ఉగ్రవాదులు ఇస్లామిక్ స్టేట్, పాకిస్తాన్, లష్కర్ ఎ తొయిబా సంస్థలకు చెందిన జెండాలు ఎగరేశారు. పాకిస్థాన్‌కు అనుకూల నినాదాలు చేశారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో నొహట్ట ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం కొద్దిసేపటికి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
జమ్ముకాశ్మీర్‌లో అల్లరిమూకలు కొంత కాలంగా ఐఎస్, పాక్ జెండాలు చూపుతుండటంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అయితే గతంలో బాహాటంగానే ఉగ్రవాద సంస్థల జెండాలు ఎగరేసే ఈ అల్లరిమూకలు ఇప్పుడు మాత్రం మొహాలకు నిండుగా ముసుగేసుకుని కనిపించారు. వేర్పాటువాదులు రెచ్చగొడుతుండటంతో ఆందోళనల్లో పాల్గొంటున్నా మొహం కనపడకుండా జాగ్రత్త పడుతున్నారు.
ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తుండటంతో గతంలో మాదిరిగా అల్లరి మూకలు బాహాటంగా ముందుకు రాలేకపోతున్నారనడానికి ఇదే నిదర్శనమని జమ్ము పోలీస్ అధికారులు అన్నారు. అయితే ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో జెండాలు ఎగరవేయడం...పోలీసులపైకి రాళ్లు రువ్వడం అంటే ప్రభుత్వం వాళ్ల పీచమణిచేందుకు ధైర్యంగా అడుగు వేయకపోవడమే కారణమని కొందరు భావిస్తున్నారు.