Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్..ట్విట్టర్ సీఈవోల మీద రాక్షసుల కన్ను
By: Tupaki Desk | 26 Feb 2016 4:09 AM GMTపురాణాల్లో ఉండే రాక్షసులకు మించిన రాక్షసత్వం.. ఆరాచకానికి సరికొత్త అర్థాన్ని చెబుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐసిస్ రాక్షస మూక కన్ను తాజాగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థలైన ఫేస్ బుక్.. ట్విట్టర్ సీఈవోలను లక్ష్యంగా చేసుకుంది. ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్.. ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేలకు తాజాగా వార్నింగ్ ఇచ్చింది.
పలు అనుమానిత ఉగ్రవాద ఖాతాల్ని నిలిపివేస్తూ ఈ రెండు సంస్థలు నిర్ణయం తీసుకోవటంపై ఐసిస్ రాక్షసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఖాతాలను నియంత్రించినా.. తమ ఖాతాలపై చర్యలు తీసుకున్నా.. తాము ఇఫ్పటికే హ్యాక్ చేసిన ఖాతాలతో.. ఒకటికి పది చొప్పున ఖాతాల్ని సృష్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకూ తాము టార్గెట్ చేయలేదంటూ జుకర్.. జాక్ లను హెచ్చరించిన ఐసిస్ సంస్థ.. త్వరలోనే వారి పేర్లను చెరిపేస్తామంటూ వారి ఫోటోల్ని చూపిస్తూ.. బుల్లెట్లతో రంధ్రాలు పెడుతున్న వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.
సోషల్ మీడియాకు చెందిన ఈ రెండు సంస్థలకు సంబంధించి 10వేల ఫేస్ బుక్ ఖాతాలు.. 150 ఫేస్ బుక్ గ్రూపులను.. 5వేల ట్విట్టర్ ఖాతాల్ని హ్యాక్ చేసినట్లుగా ఐసిస్ ఉగ్రవాదులు పేర్కొన్నారు. తమకు సంబంధించిన ఖాతాల మీద చర్యలు తీసుకుంటే.. అందుకు ప్రతిగా తాము హ్యాక్ చేసిన ఖాతాల్ని కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా ప్రముఖ సోషల్ మీడియా సంస్థల అధిపతుల్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటం సంచలనం సృష్టిస్తోంది.