Begin typing your search above and press return to search.
కంభంపాటి అత్యుత్సాహం; తెలుగోళ్లు దొరకలేదు
By: Tupaki Desk | 6 Aug 2015 4:36 AM GMTకీలకస్థానాల్లో ఉన్నవారు.. మాట్లాడే విషయంలో ఏ చిన్న పొరపాటు దొర్లినా దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తాజా ఉదంతం చెప్పకనే చెబుతోంది. తీవ్రమైన గందరగోళంతోపాటు..బాధ.. మానసిక వేదనకు గురి చేస్తాయి.
లిబియాలో కిడ్నాప్ అయి.. ఇంకా తీవ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న ఇద్దరు తెలుగువారు (గోపికృష్ణ.. బలరాం) విడుదల అయినట్లుగా చెప్పటమే కాదు.. వారి ప్రాణాలకు తమదే పూచీకట్టు అన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే.
టీవీల్లో బ్రేకింగ్ న్యూస్.. కంభంపాటి వ్యాఖ్యల్ని కొన్ని ఛానల్స్ ప్రసారం చేసినా.. అదంతా ఉత్తినే అన్న విషయం తేలింది. సమాచార లోపం కారణంగా తాను అలా చెప్పాల్సి వచ్చిందని కంభంపాటి పేర్కొన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే సమయంలో ఆచితూచి మట్లాడాల్సింది పోయి.. అంత బాధ్యతారాహిత్యంతో ఎలా మాట్లాడతారన్నప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కంభంపాటి మాటల్ని విన్న కిడ్నాప్ గురైన కుటుంబాలకు చెందిన కుటుం సభ్యులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న విదేశాంగ శాఖ స్పందించి..ఆ వార్తలో నిజం లేదని.. దాన్నిప్రసారం చేయొద్దని.. కిడ్నాపర్ల నుంచి విడుదలైనట్లుగా ఎలాంటి అధికారిక సమాచారం లేదన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. దీంతో.. అప్పటివరకూ ఆనందంగా ఉన్న కిడ్నాప్ గురైన కుటుంబసభ్యలు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. మరి.. తెలుగువారు క్షేమంగా విడుదలయ్యారన్న వార్త ఎప్పటికి వింటాయో..?