Begin typing your search above and press return to search.
ఐసిస్ టార్గెట్ చూస్తే ఆశ్చర్యపోతారు
By: Tupaki Desk | 13 Aug 2016 10:52 AM GMTమసీదులు - మార్కెట్లు - ప్రార్థనా మందిరాలు - జన సమ్మర్దం ఉండే ప్రాంతాలు - విదేశీ రాయబార కార్యాలయాలు - పబ్ లు.... ఇలా ఉగ్రవాద సంస్థ ఐఎస్ ఐఎస్ టార్గెట్ చేయనిదంటూ లేదు. అయితే ఇపుడు వాటి నుంచి టార్గెట్ మళ్లించిన ఐసిస్ అందాల పోటీలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ఐసిస్ ప్రకటించి మరింత కలకలం సృష్టించింది.
వచ్చే ఏడాది జనవరిలో పిలిప్పీన్స్ లో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీలను ఐసిస్ టార్గెట్ చేసింది. పిలిప్పీన్స్ సపోర్టర్స్ అనే బృందానికి ఐఎస్ ఒక వీడియోను విడుదల చేసింది. 'ఎవ్రీవన్ హూ కెన్' పేరుతో టెలిగ్రామ్ మెసెంజర్ ద్వారా విడుదల చేసిన ఈ వీడియోలో ఎవరైనా సరే జనవరిలో జరిగే మిస్ యూనివర్స్ పోటీలపై దాడి చేయడానికి సిద్ధం కావచ్చని పేర్కొంది. ఆ పోటీల్లో మిస్ యూనివర్స్ గా గెలిచే వారిని హతమార్చేందుకు ఒక బాంబు తయారు చేయాలని జీహాదీలకు సూచించింది. ఆత్మాహుతి దాడి కోసం వాడే బెల్ట్ లు - దుస్తులను ఎలా తయారు చేయాలో కూడా ఆ వీడియోలో వివరించారు. అంతే కాకుండా, ఐఎస్ కు వ్యతిరేకంగా యుద్ధం చేసిన విదేశీయులను లక్ష్యంగా చేసుకుని వారిని హతమార్చేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యే వాళ్లంతా ముందుకు రావాలని కోరింది. ఐసిస్ విడుదల చేసిన ఈ వీడియోతో ఇపుడు ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. పిలిప్పీన్స్ బదులుగా మరే దేశాన్ని అయినా ఎంచుకొని అందాల పోటీలు నిర్వహించాలని భావిస్తున్నాయి.