Begin typing your search above and press return to search.

వారంతా స్వర్గంలో కన్యలవుతారట!

By:  Tupaki Desk   |   4 Oct 2016 6:14 AM GMT
వారంతా స్వర్గంలో కన్యలవుతారట!
X
స్వర్గంలో కన్యలుగా మారాలంటే ఏం చేయాలి? ఈ పిచ్చి ప్రశ్నకు... సమాధానం చెబుతున్నారు ఐసిసి తీవ్రవాదులు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా శాంతిని - ప్రశాంతతను దూరం చేయడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాజాగా మహిళలలు ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంతకాలం మహిళలను - అమ్మాయిలను అపహరించి సెక్స్ బానిసలుగా చేసుకున్న వీరంతా - ఇప్పుడు నేరుగా అమ్మాయిలంకు వల వేస్తున్నారట. దానికి వారు ఎంచుకున్న మార్గం... ఐసిస్ లో చేరిన యువతుల జీవితాలు భాగుంటాయని చెప్పడంతో పాటు స్వర్గంలో కన్యలుగా మారతారనే మాట.

ఇక్కడ అమ్మాయిలు ఐసిస్ కి సెక్స్ బానిసలుగా ఉంటే వారంతా స్వర్గంలో కన్యలేనని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల (ఐసిస్) తాజా వాదన! మహిళలను ఐసిస్ ఉగ్రవాదులు సెక్స్ బానిసలుగా చేసుకుంటున్నారన్న సంగతి తెలిసిందే.. ఇదే క్రమంలో వారిపట్ల ఈ ఉగ్రవాదులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంటారో కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా ఒక మహిళ తన ఆవేదనను వెల్లడించిన సంగతీ తెలిసిందే. తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణలో ఐసిస్ విషయమై ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.

ఇటీవల జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ ఐఏ) తమిళనాడు - కేరళ రాష్ట్రాల్లో ఐసిస్‌ లో చేరాలనుకున్న వారిని అడ్డుకుని, వారిని అదుపులోకి తీసుకొని విచారించింది. ఈ సందర్భంలో నాలుగు నెలలుగా ఐసిస్ కి ఆకర్షితులవుతున్నారు అనే అనుమానంపై కొందరిపై కన్నేసింది. చివరకు రెండు రోజుల క్రితం వారంతా ఐసిస్ వైపు మొగ్గు చూపారనే పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి పంపింది. వీరందరినీ కౌన్సిలింగ్ చేసిన షఫీ అమర్ వీరిని ఐసిస్ వైపు మళ్లించాడని తెలుస్తోంది. అయితే వీరి మాటలు నమ్మి ఐసిస్ లో చేరడానికి సిద్దమయ్యే వార్కి రిక్రూట్మెంట్ సమయంలోనే సిరియా లేదా ఇరాక్‌ లో పనిచేయాల్సి ఉంటుందని చెప్పేవారని తెలుస్తోంది. అలాగే ఐసిస్‌ లో చేరే వారికి మంచి జీవితం ఉంటుందని హామీ ఇవ్వడంతోపాటు - ఐసిస్ లో యువతులు సెక్స్ బానిసలుగా ఉన్నప్పటికీ స్వర్గంలో మాత్రం వారంతా కన్యలుగా ఉంటారని ప్రామిస్ కూడా చేసేవారట. ఈ మాటలను నమ్మిన యువత ఐసిస్ వైపు ఆకర్షితులవుతున్నారని సమాచారంతోనే జాతీయ దర్యాప్తు సంస్థ కొందరిపై కన్నేసి - నిర్ధారణ అయిన తర్వాత అదుపులోకి తీసుకుంది!!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/