Begin typing your search above and press return to search.

ఖలీఫా రాజ్యం 2020 నాటికి ఎలానంటే..?

By:  Tupaki Desk   |   11 Aug 2015 4:22 AM GMT
ఖలీఫా రాజ్యం 2020 నాటికి ఎలానంటే..?
X
దుర్మార్గమైన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు.. తమ ఆరాచకాల్ని ప్రపంచం మొత్తాన్ని వ్యాపింపచేయాలన్న లక్ష్యంతో ఉన్న నిజం బయటకు వచ్చింది. ప్రపంచం మొత్తాన్ని మరో ఐదేళ్లలో తమ వశం చేసుకోవటానికి వ్యూహాన్ని సిద్ధం చేసింది. తమ వ్యూహాన్ని విజయవంతం చేసే పనిలో భాగంగా భారత ఉప ఖండం మీద ప్రత్యేక దృష్టిని సారించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యూహాన్ని రచించిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.

బీబీసీకి చెందిన ఆండ్ర్యూ హాస్కెన్ రాసిన ఎంఫైర్ ఆఫ్ ఫియర్.. ఇన్ సైడ్ ద ఇస్లామిక్ స్టేట్ పుస్తకంలో భయం కలిగించే అనేక విషయాల్ని వెల్లడించాడు. ప్రపంచాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చేందుకు ఒక భారీ పథకానికి ఇరవైఏళ్ల క్రితమే అంకురార్పణ జరిగిందని.. ఆ వ్యూహంలోభాగంగానే చాలా కార్యక్రమాలు చేపట్టారని చెబుతున్నారు. ఇతగాడి పుస్తకంలో వెల్లడించిన విషయాల్ని చూస్తే.. ఇస్లామిక్ దేశాలపై యద్ధం చేసేలా రెచ్చగొట్టటం.. అమెరికా యుద్ధంలోకి దిగటం మొత్తం కూడా ముందస్తుగా సిద్ధంగా చేసిన ప్రణాళికగా చెబుతున్నారు.

2010.. 13 మధ్యకాలంలో అరబ్ పాలకులకు వ్యతిరేకంగా తిరుబాట్లను లేవనెత్తాలన్న వ్యూహాన్ని కూడా ఇందులో భాగంగా చెబుతున్నారు. ప్రపంచాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చేందుకు వీలుగా.. ఒక రూట్ మ్యాప్ ను ఏర్పాటు చేయటమే కాదు.. దానికి సంబంధించిన వివరాల్ని పేర్కొన్నారు. షరియత్ చట్టం ప్రకారం సాగే ఈ ఖలీఫా రాజ్యాన్ని పశ్చిమాన స్పెయిన్ నుంచి తూర్పున చైనా వరకు విస్తరించాలని ఐఎస్ గురి పెట్టిందని చెబుతున్నారు.

ప్రస్తుతం 50 వేల మంది ఉన్న ఐఎస్ సంస్థ.. తన వ్యూహాంలో భాగంగా తాను రూపొందించి ఇస్లామిక్ స్టేట్ పటంలో.. స్పెయిన్.. పోర్చుగల్.. ఫ్రాన్స్ దేశాలతోకూడిన భూభాగాన్ని ఆండలుస్ అని.. భారత ఉపఖండానికి ఖురాసన్ అని పేర్లు పెట్టినట్లుగా హాస్కెన్ తన పుస్తకంలో వెల్లడించాడు. ఇప్పటివరకూ ప్రపంచాన్ని జయించాలన్న ఏ ఒక్కరి కల నిజం కాలేదు. మూర్ఖత్వానికి.. రాక్షసత్వానికి.. క్రూరత్వానికి నిలువెత్తు రూపమైన ఐఎస్ తీవ్రవాదులు కల కనే అవకాశం ఇవ్వకుండా ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.