భార్యను ఇలా వాడుకోవటం ఏంటి?
By: Tupaki Desk | 11 Jun 2015 9:24 AM GMTపిచ్చి పీక్ స్టేజీకి చేరితే ఎవరినయినా ఏం చేయగలం? దరిద్రులు అని వదిలేయడం తప్ప! అరాచకత్వానికి మూర్ఖత్వం తోడయితే ఎలా ఉంటుందనే దానికి తాజా ఉదాహరణ ఒకటి బయటకు వచ్చింది. తమ మతం ఒక్కటే ఉండాలని, తమ రాజ్యమే ఏర్పడాలని పోరాటం చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ఆండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు సొంత కొంపకు ఎసరు పెట్టుకుంటున్నారు.
ఎలక్ట్రానిక్ మార్గాలైన సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల ద్వారా సమాచారం పంపితే అమెరికా నిఘా వర్గాలు సులభంగా పసిగడుతున్నాయని ఐఎస్ఐఎస్ వర్గాలు భావించాయి. దీంతో ఉగ్రవాదులు కొత్త ఎత్తుగడకు దిగారు. ఉగ్రవాద రహస్యాలను, సమాచారాన్నిఒకరి నుంచి మరొకరికి అందించేందుకు 'భార్యలను' ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కీలక సమాచారం చేరవేయడమే కాదు... సేకరించడంలోనూ భార్యలను విరివిగా వాడుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ సహా మిగతా టెర్రరిస్ట్ నాయకులంతా ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అగ్రనాయకత్వాన్ని కలవబోయే ముస్లిం మత పెద్దలు, వ్యాపారులు, ఇతర నాయకులకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకువస్తే అనుమతించేది లేదని హెచ్చరికలు జారీ చేయించరట.
తూర్పు సిరియాలో డెల్టా ఫోర్స్ కమాండో ఉగ్రవాద నేత అబూ సయ్యఫ్ పై దాడి జరిపింది. ఈ క్రమంలోనే దాడిలో లాప్‌టాప్‌లు, సెల్ ఫోన్ల ద్వారా ఉగ్రవాదుల విలువైన సమాచారం దొరికింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద నాయకత్వం ఆచూకీ తెలిపే డాటా సంకీర్ణ దశాలకు దొరకడంతో ఐఎస్ ఉగ్రవాదులు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడం మానేశారు. వాటి బదులుగా తమ భార్యలను సమాచార వారధులుగా ఉపయోగించుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. అయితే కమెండోలు మరింత కొత్త ఎత్తుగడ వేశారట. ఉగ్రవాదులు ఎవరు? వారికి ఎందరు భార్యలు ఉన్నారు? ఎవరిలో ఉగ్రవాదులు సత్సంబంధాలు కలిగిఉన్నారు అనే వివరాలు ఆరాతీస్తున్నట్లు తెలుస్తోంది.