Begin typing your search above and press return to search.

అక్కడ ఆరాచకానికి అడ్డే లేదు

By:  Tupaki Desk   |   25 May 2015 7:15 AM GMT
అక్కడ ఆరాచకానికి అడ్డే లేదు
X
ఆధునిక మానవ యుగంలో అత్యంత దుర్మార్గంగా.. పాశవికంగా.. అనాగరికంగా వ్యవహరిస్తున్న వారిలో ఆగ్రస్థానం ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులదే. రాక్షసుల మాదిరి వ్యవహరిస్తూ.. అత్యంత దారుణంగా వ్యవహరించే వారు వేలాదిమంది అమాయకుల ప్రాణాల్ని ఆకారణంగా తీసేసుకోవటం తెలిసిందే.

తాజాగా.. 217 మందిని ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులు గడిచిన తొమ్మిదిరోజుల్లో ఉరి తీసిన దారుణంగా కాస్త ఆలస్యంగా ప్రపంచానికి తెలిసింది. సిరియాకు చెందిన మానవ హక్కుల సంస్థ ఒకటి తెలిపిన వివరాల ప్రకారం.. సరైన కారణం ఏమీ లేకుండానే 217 మందిని ఉరి తీసినట్లు చెబుతున్నారు. వారిలో చిన్నారులు.. సామ్యాలు.. ప్రభుత్వ అధికారులు భారీగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

సిరియాలోని పురాతన నగరమైన పాల్మిరాలో ఈ నెల 16 నుంచి ఈ దుర్మార్గకాండ మొదలైనట్లు చెబుతున్నారు. సామాన్యులు.. చిన్నారులతో కలిపి 67 మంది.. 150 మంది ప్రభుత్వ బలగాల్ని.. 12 మంది మహిళల్ని ఆకారణంగా ఉరి తీసినట్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఈ ఘటనలపై ఆవేదన వ్యక్తం చేయటమే తప్పించి.. ఐఎస్‌ఐఎస్‌ తీవ్రవాదులపై చర్యలు తీసుకునే దిశగా ఇప్పటికి సరైన చర్యలే తీసుకోలేదు. అగ్రరాజ్యాల నిర్లక్ష్యానికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.