Begin typing your search above and press return to search.

ఇప్పటికి.. పెద్దన్న రేంజ్ వార్నింగ్ ఇచ్చారు

By:  Tupaki Desk   |   15 Jun 2016 6:16 AM GMT
ఇప్పటికి.. పెద్దన్న రేంజ్ వార్నింగ్ ఇచ్చారు
X
పురాణాల్లో రాక్షసుల రాక్షసకాండ గురించి చదివే ఉంటాం. కానీ.. వాటికి మించిన దారుణాలకు పాల్పడుతూ.. భూలోకంలో నరకానికి మించిన పరిస్థితుల్ని సృష్టించిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు మూడిందని చెప్పాలి. ఇంతకాలం తమదైన ప్రపంచం అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. దారుణాలకు పాల్పడినా పెద్దన్న హోదాలో ఉన్న అమెరికా పట్టించుకుంది అంతంతమాత్రమే. అదేమంటే.. తమది కాని విషయం అన్నట్లుగా వారి విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు.

తాజాగా అర్లాండ్ లో చోటు చేసుకున్న నరమేథం పెద్దన్నకు కోపం వచ్చేలా చేయటమే కాదు.. ఆగ్రహంతో ఊగిపోతూ భారీ వార్నింగ్ నే ఇచ్చారు. తమతో పెట్టుకుంటే నామరూపాల్లేకుండా చేస్తామంటూ డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చేశారు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఐఎస్ ప్రాబల్యం ఉన్న ఇరాక్.. సిరాయాల్లో ఆ సంస్థకు చెందిన టాప్ 120 మందిని హతం చేశామని.. ఇకపై కూడా ఆ పని సాగుతుందన్న ఆయన.. మరింత వేగంగా పని చేస్తామని తేల్చి చెప్పారు.

తాము ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నామని.. తమ దేశంతో కానీ.. తమ దేశంతో సంబంధాలు ఉన్న ఇతర దేశాలు కానీ టార్గెట్ అయితే.. అది ఐఎస్ కు ఎప్పటికి సురక్షితం కాదని ఒబామా స్పష్టం చేశారు. ఇంధనం అమ్మకాలతోనే ఇస్లామిక్ స్టేట్ ప్రధాన ఆదాయ వనరని.. అదే వారికి కోట్లలో ఆదాయాన్న అందిస్తుందని.. అలాంటి లక్ష్యాల్ని గుర్తించి వాటిని నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు. చూస్తుంటే తాజా ఉగ్రదాడి ఒబామాకు మండిపోయేలా చేయటమే కాదు.. ఇస్లామిక్ స్టేట్ అంతు చూడాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా స్పష్టం చేస్తున్నట్లుగా చెప్పాలి.