Begin typing your search above and press return to search.
ఆ ఐఎస్ ఉగ్రవాది హిందువు
By: Tupaki Desk | 5 Jan 2016 9:10 AM GMTఐఎస్ ఉగ్రవాదుల్లో సరికొత్త జిహాదీ జాన్ గా అవతరించి తలలు తెగ్గోస్తున్న ముష్కరుడి గురించిన ఊహించని వాస్తవం ఒకటి ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. బ్రిటన్ కు చెందిన ఈ జిహాదీ అసలు ముస్లిం కాదట.... అచ్చమైన హిందువు. కానీ, ముస్లింగా మారి ఐఎస్ లో చేరి దారుణాలకు ఒడిగడుతున్నట్లు చెబుతున్నారు. ఆ రాక్షసుడి అసలు పేరు సిద్ధార్ధ ధర్. బ్రిటన్ తరఫున ఐఎస్ పై గూఢచర్యం చేస్తూ దొరికిన అయిదుగురి పీకలను చాకుతో అత్యంత దారుణంగా కోస్తున్నదృశ్యాలు అంతర్జాలంలో భయోత్పాతం సృష్టిస్తున్నాయి. ఆ వీడియోలో ఉగ్రవాదులకు నాయకత్వం వహించింది ఈరాక్షసుడే. బ్రిటన్ మీడియా సిద్ధార్ధకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. హిందువైన సిద్దార్ధ మతం మార్చుకుని రూమై సాహ్ గా పేరు కూడా మార్చుకుని ఐఎస్ సంస్థలో చేరాడని చెప్తున్నారు. ఐఎస్ లో ఇప్పుడాయన హై ప్రొఫైల్ ఉగ్రవాదని బ్రిటన్ వర్గాలు ధ్రువీకరించాయి కూడా.
ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న వీడియో లో అయిదుగురు ఐఎస్ ఉగ్రవాదులు కనిపిస్తారు. ముసుగులు వేసుకని ఉన్నవారిలో మధ్య లో ఉన్న వ్యక్తి సిద్ధార్ధ అని బ్రిటన్ అధికారులు ప్రకటించారు. సిద్ధార్ధ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ను కూడా చంపేస్తానని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక తరువాత తమ వద్ద ఉన్న అయిదుగురు బందీలను కత్తితో పీకలు కోసి చంపేశారు. ఆ భయంకర దృశ్యాలు చూసినవారు హడలిపోతున్నారు.
కాగా ఆ వీడియో ద్వారా కామెరూన్ ను హతమారుస్తామని చెప్పిన దాంట్లో గొంతు తన అన్న సిద్ధార్ధదేనని ఆయన చెల్లెలు కనికా ధర గుర్తు పట్టింది. సిద్ధార్ధతో పరిచయం ఉన్న చాలామంది ఆ గొంతు సిద్ధార్ధేదని గుర్తించారు. సిద్ధార్ధ ఒడిశా లేదా బెంగాల్ - అస్సాం ప్రాంతానికి చెందిన కుటుంబాల వ్యక్తని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది.
ఉగ్రవాద భావజాలానికి లోనవుతున్నారన్న అనుమానంతో కొందరిని సెప్టెంబరులో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు పట్టుకున్నారు. వారిలో సిద్ధార్థ కూడా ఉన్నారు. అయితే, డిసెంబరులో వారందరినీ వదిలేశారు. ఆ మరుసటి రోజే సిద్దార్ధ సిరియా వెళ్లిపోయాడని తెలుస్తోంది. ఇప్పుడు సిరియాలో సిద్ధార్ధ ఐఎస్ టాప్ లీడర్లలో ఒకడని చెప్తున్నారు.