Begin typing your search above and press return to search.

బండి సంజ‌య్ ప్రిపేర్ అయ్యి మీడియా ముందుకు రావ‌డం లేదా?

By:  Tupaki Desk   |   19 Sep 2022 11:30 AM GMT
బండి సంజ‌య్ ప్రిపేర్ అయ్యి మీడియా ముందుకు రావ‌డం లేదా?
X
ఒక రాజ‌కీయ నాయ‌కుడు మాట్లాడుతున్నాడు అంటే.. ప్ర‌జ‌లు చాలా ఇంట్ర‌స్ట్‌గా వింటారు. వారేదైనా కీల‌క స‌మాచారం చెబుతారేమో.. స‌మ‌స్య‌పై ఏదైనా మాట్లాడ‌తారేమో.. అని ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. అందుకే.. ఇత‌ర మీడియా మీటింగుల‌కంటే.. కూడా రాజ‌కీయ నాయ‌కులు..చేసే మీడియా ప్రసంగాల‌కు ఫాలోయింగ్ ఎక్కువ‌గా ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ల‌కు అయితే.. ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంటుంది.

ఇలా..ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా.. కామెంట్లు కుమ్మ‌రించే నేత‌గా.. తెలంగాణ బీజేపీ చీఫ్‌.. బండి సంజ‌య్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న ఎక్క‌డ మాట్లాడినా.. ఖ‌చ్చితంగా ఫైర్ ఉంటుంది. ఎంత చిన్న స‌బ్జెక్ట్ అయినా.. ఆయ‌న రెచ్చిపోతుంటారు.దీంతో బండి మీటింగులు అంటే.. ఖ‌చ్చితంగా స‌బ్జెక్ట్ ఉంటుంద‌నే వాద‌న ఉంది. దీంతో ఆయన ప్రెస్‌మీట్ల‌కు వ‌చ్చేవారు.. వాటిని క‌వ‌ర్ చేసేవారే కాదు.. చూసేవారు.. వినేవారు కూడా ఎక్కువ‌గా ఉన్నారు.

అయితే.. కొన్ని కొన్ని విష‌యాల్లో బండి స‌బ్జెక్టు లేకుండా.. మీడియా ముందుకు వ‌స్తుండ‌డంతో ఆయ‌న ను నెటిజ‌న్లు ఆట‌ప‌ట్టిస్తున్నారు. కీల‌క‌మైన విష‌యాల్లో ఆయ‌న‌హ్యాండ్స‌ప్ అన్న విధంగా వ్య‌వ‌హ‌రిస్తుం డ‌డం తో న‌వ్విపోతున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ స‌మాజంలో పెద్ద డౌటు ఉంది.. అదే విమోచ‌న దినంపై. సెప్టెంబ‌రు 17ను తెలంగాణ విమోచ‌నం అంటూ.. కేంద్రం నుంచి రాష్ట్ర వ‌ర‌కు.. బీజేపీ పెద్ద‌లు పెద్ద హంగామా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా.. వ‌చ్చి.. మ‌రీ ఇక్క‌డ ప్ర‌సంగించి వెళ్లారు.

ఆ త‌ర్వాత‌.. బండి సంజ‌య్‌.. మీడియామీటింగ్ పెట్టారు. అప్ప‌టి హోం మంత్రి స‌ర్దార్ వ‌ల్ల‌భ్ భాయ్‌ ప‌టేల్‌ను త‌మ వాడుగా ప్ర‌క‌టించారు. అయితే.. ఇంత‌కు మించి ఆయ‌న‌ద‌గ్గ‌ర స‌బ్జెక్టు లేక‌పోవ‌డంతో నెటిజన్లు దీనిపైనే కామెంట్లు చేస్తున్నారు. ఎంత సేపూ.. సెంటిమెంటు మీద బ‌తుకుతున్నారే.. అని మేధావులు సైతం.. వ్యాఖ్యానిస్తున్నారు.

దీనికి కార‌ణం.. వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌.. నిజంగానే తెలంగాణ‌ను విముక్తి క‌ల్పించారు. ఇది ఎవ‌రూ కాద‌న‌రు. కానీ.. ఆయ‌న‌ను సెంటిమెంటుగా వాడుకుని.. రాజ‌కీయం చేయాల‌నే బీజేపీ వ్యూహాన్నే వారు త‌ప్పుబ‌డుతున్నారు. పోనీ.. ప‌టేల్‌ను త‌మ వాడే అనుకుంటే.. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టిన‌.. నిజాంను ఎందుకు ఆయ‌న అరెస్టు చేయించ‌లేక‌పోయారు.. అనేది.. యూట్యూబ్‌లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది.

1948-1952 వ‌ర‌కు నిజాం ఉన్నాడ‌ని.. చెబుతున్నారు. అయితే.. ఆయ‌న‌నుఎందుకు అరెస్టు చేయ‌లేక పోయార‌నేది ఒక డౌట్ అయితే.. అదేస‌మ‌యంలో నిజాంను ఆడించిన‌ట్టు చ‌రిత్ర చెబుతున్న‌.. ఖాసిం రిజ్వీ త‌ర్వాత .. కాలంలో పాకిస్థాన్‌కు త‌ప్పించుకుని పారిపోయాడు. ఆయ‌న అత్యంత కీల‌క‌మ‌ని.. అస‌లు ప్ర‌జ‌ల‌ను హింసించిందే.. ఆయ‌న‌ని చ‌రిత్ర చెబుతోంది. మ‌రి ప‌టేల్ ఉన్న‌ప్పుడే.. ఆయ‌న‌ను ఎందుకు పాక్‌కు వెళ్లిపోయిన‌ప్ప‌టికీ చూస్తూ.. ఉండిపోయారు? అనేది.. మ‌రో ప్ర‌శ్న‌.

ఇలాంటి కీల‌కమైన .. అత్యంత సున్నిత‌మైన ఈ వ్య‌వ‌హారాల‌పై.. అప్ప‌టి ప్ర‌జ‌లు.. ధైర్యంగా ముందుకు వ‌చ్చి..యూట్యూబ్ ఛానెళ్ల‌తో ఏం జ‌రిగిందో చెబుతున్నారు. కానీ.. బండి సంజ‌య్ మాత్రం సెంటిమెంటు ను న‌మ్ముకుని.. కేవ‌లం స్టేట్ మెంట్ల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి మీడియాలో టీఆర్ ఎస్‌ను టార్గెట్ చేయాలి.. ఆ పార్టీ నాయ‌కుల‌పై దుమ్మెత్తి పోయాలి.. అంటే.. వేరే వేరే చాలా స‌బ్జెక్టులు ఉన్నాయ‌ని.. చెబుతున్నారు. ఇలాంటి అత్యంత సున్నిత‌మైన విష‌యాల‌ను మీడియా ముందు లేవ‌నెత్తి.. నీళ్లు న‌మ‌ల‌డం ఎందుకు సంజ‌య్ అన్నా!! అంటున్నారు ప‌రిశీల‌కులు.

కొస‌మెరుపు... ఏంటంటే.. ఇందిరా గాంధీ హ‌యాంలో హోం మంత్రిగా ప‌నిచేశారు ప‌టేల్‌. అప్ప‌టికి బీజేపీ పుట్ట‌నేలేదు. ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత‌.. బీజేపీ ఆవిర్భ‌వించింది. మ‌రి.. అలాంటి కాంగ్రెస్ ర‌క్తం ఉన్న ప‌టేల్‌ను.. బీజేపీ ఎలా ఓన్ చేసుకుంటుంది? అన్న రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నకు కూడా బండి ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.