Begin typing your search above and press return to search.
చైనా వాల్‌పై ఇజ్రాయెల్ సంచలన అధ్యయనం
By: Tupaki Desk | 9 Jun 2020 11:30 PM GMTవేల కిలోమీటర్లు ఎత్తయిన కొండపై మన ఇంటిపక్కల గోడ ఉన్నట్టు ప్రహారీ గోడ చైనాలో పేద్ద గోడ ఉంది. దాన్నే గ్రేట్ వాల్ ఆఫ్ చైనాగా పిలుస్తారు. ప్రపంచ వింతల్లో ఒకటిగా ఆ గోడ నిలిచింది. చాలా రోజుల తర్వాత ఈ గోడకు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. పలు సంచలన విషయాలు ఇజ్రాయెల్ ఆర్కియాలజిస్ట్‌లు బయటపెట్టారు. ఆ గోడ దేశాన్ని రక్షించుకోవడానికి కాదని.. ప్రజలను పర్యవేక్షించేందుకు నిర్మించారని గుర్తించారు. చైనా వాల్ ఉత్తర భాగాన్ని ఆక్రమణలను నిరోధించడానికి కాదని.. పౌరులను పర్యవేక్షించే నిమిత్తం నిర్మించినట్లు ఆర్కియాలజిస్ట్‌లు తెలిపారు.
పరిశోధకులు మొదటిసారి 740 కిలోమీటర్ల పొడవైన చైనా వాల్ ఉత్తరభాగాన్ని పూర్తిగా మ్యాప్ చేశారు. వారి పరిశోధనలో తెలిసిన అంశాలు మునుపటి పరిశీలనలను సవాలు చేస్తున్నాయి. రెండేళ్లుగా ఈ పరిశోధనలకు అధ్యక్షత వహించిన జెరూసలేం హిబ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన గిడియాన్ షెలాచ్ లావి ఈ సందర్భంగా మాట్లాడారు. తమ పరిశోధనకు ముందు, చెంఘిజ్ ఖాన్ సైన్యాన్ని ఆపడం కోసమే ఉత్తర భాగంలో గోడ నిర్మాణాన్ని చేపట్టినట్లు చాలామంది భావించారని తెలిపారు. కానీ ఈ భాగం లోతు తక్కువగా ఉన్న మంగోలియాలోని రహదారులకు సమీపంగా ఉందని గుర్తించామని చెప్పారు. ఈ ఉత్తర భాగాన్ని సైనికేతర పనుల కోసం అనగా ప్రజలు, పశువుల కదలికలను పర్యవేక్షణ, నిరోధించడం.. వాటికి పన్ను విధించడం వంటి కార్యక్రమాల కోసం నిర్మించారని తమ అధ్యయనం తేల్చిందని వివరించారు.
షెలాచ్-లావి, అతడి ఇజ్రాయెల్, మంగోలియన్, అమెరికన్ పరిశోధకుల బృందం గోడలను మ్యాప్ చేయడానికి డ్రోన్లు, అధిక-రిజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు, సాంప్రదాయ పురావస్తు సాధనాలను ఉపయోగించి పరిశోధనలు చేశారు. వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నిర్మాణం మొదట క్రీస్తుపూర్వం మూడో శతాబ్దంలో ప్రారంభమై.. శతాబ్దాలుగా కొనసాగింది. పురాణ మంగోలియన్ విజేతకు చిహ్నంగా ‘చెంఘిజ్ ఖాన్ వాల్’ అని పిలవబడే ఉత్తర భాగం 11, 13వ శతాబ్దాల మధ్య నిర్మించబడింది. ఇది 72 చిన్న చిన్న నిర్మాణాలతో నిండి ఉంది.