Begin typing your search above and press return to search.
ఇజ్రాయెల్ లో బెంజమిన్ ప్రభుత్వాన్ని గద్దెదించి... కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఏకమైన ప్రతిపక్షాలు !
By: Tupaki Desk | 3 Jun 2021 9:35 AM GMTఇజ్రాయెల్ లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం వీగిపోవాల్సిందే, విపక్ష నేత ఎయిర్ లాపిడ్ వెల్లడించారు. దీనికి అనువుగా విస్తృత సంకీర్ణ కూటమిని కూడగట్టుకోవడంలో తాను సఫలీకృతుడైనట్టు ఆయన అధ్యక్షుడు రూవెన్ రివ్ లిన్ కి తెలిపారు. రానున్న రోజుల్లో 120 మంది సభ్యులతో కూడిన నీసెట్ లెజిస్లేచర నెతన్యాహు ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకోవాలని చూస్తుందని ఆయన చెప్పారు. బీబీగా వ్యవహరించే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు.
నెతాన్యాహును పదవీ చ్యుతుడిని చేయడానికి గత రాత్రంతా ప్రతిపక్ష నేతలు విస్తృత చర్చలు జరిపారు. అర్ధరాత్రిలోగా ఓ ఒప్పందానికి రావాలని డెడ్ లైన్ విధించుకున్నారు. చివరకు తాను విజయం సాధించానని మాజీ టీవీ న్యూస్ యాంకర్ అయిన లాపిడ్ తన ఫేస్ బుక్ లో వెల్లడించారు. ఈ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇజ్రాయెల్ ప్రజలకు సేవ చేస్తుందని, తాను ప్రామిస్ చేస్తున్నానన్నారు. మాకు ఓటు వేసినవారికి, వేయని వారికి కూడా మా సేవలు అందిస్తాం అని అన్నారు. రొటేషన్ పద్ధతిన అధికార పంపిణీ జరుగుతుందన్నారు. మొదటి రెండేళ్లు ప్రధాన విపక్ష నేత నఫ్తాలీ బెనెట్, ఆ తరువాత రెండేళ్ల అనంతరం తను ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడతానన్నారు.
కాగా, ఇజ్రాయెల్ బాగు కోసం తాము ఇతోధికంగా కృషి చేస్తామని, ఈ దేశాన్ని మళ్ళీ ట్రాక్ లోకి తెస్తామని బెనెట్, తమ దేశాధ్యక్ధుడికి తెలిపారు. అటు, ఎంపీలు వీరి కొత్త ప్రభుత్వాన్ని ధృవీకరించడానికి వారం రోజుల వ్యవధి ఉంది. ఈ లోగా నెతన్యాహు, అయన సన్నిహితులు తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు చేపడతారో ఇప్పటివరకు వెల్లడి కాలేదు. రెండేళ్లలో ఇజ్రాయెల్ ఎన్నికలు జరగనున్నాయి. నెతన్యాహు వ్యతిరేక కూటమిని మరింత బలంగా కూడగట్టుకునేందుకు లాపిడ్ ఏడు పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది.