Begin typing your search above and press return to search.
సంకీర్ణ ప్రభుత్వంలో అధికార యుద్ధం .. రాత్రికి రాత్రే కుప్పకూలిన ఇజ్రాయెల్ సర్కార్
By: Tupaki Desk | 23 Dec 2020 5:33 AM GMTఇజ్రాయెల్ లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. రాజకీయ సంక్షభంతో అనూహ్యంగా రాత్రికిరాత్రే ప్రభుత్వం కూలిపోయింది. సమయానికి బడ్జెట్ ను ఆమోదించడంలో విఫలం కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. వచ్చే ఏడాది మార్చి 23న తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత రెండేళ్లలో ఇజ్రాయెల్లో ఎన్నికల జరుగుతుండడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
ఈ ఏడాది ఏప్రిల్ లో బెన్నీ గాంట్జ్ నేతృత్వంలోని బ్లూ అండ్ వైట్ పార్టీతో కలిసి నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి పదవిని పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. 18 నెలలు నెతన్యాహు ప్రధానిగా పనిచేసిన అనంతరం బ్లూ అండ్ వైట్ పార్టీకి పగ్గాలు అప్పగించాలని ఈ ఏడాది ఏప్రిల్లో ఒప్పందం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, ఇటీవల ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కనీసం బడ్జెట్ కూడా ఆమోదింప చేసుకోలేని పరిస్థితి వచ్చింది.
దీనితో ఏకంగా మరోసారి పార్లమెంటు రద్దయింది. ఇరు పార్టీలు పరస్పరం తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. కరోనా విజృంభణ సమయంలో బ్లూ అండ్ వైట్ పార్టీ ప్రభుత్వం కూలిపోయేలా వ్యవహరించిందంటూ నెతన్యాహు విమర్శించారు. అయితే, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నెతన్యాహు సొంత ప్రయోజనాలను చూసుకుంటున్నారంటూ బ్లూ అండ్ వైట్ పార్టీ విమర్శలు గుప్పించింది. ఎన్నికలకు వెళ్లడానికి తాము భయపడట్లేదని, వాటిని ఎప్పుడు నిర్వహించినా తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలను నిర్వహించగా.. సరిగ్గా మళ్లీ ఏడాది నాటికి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోంది.