Begin typing your search above and press return to search.

శృంగారం ఆ అమ్మాయి ప్రాణం తీసింది

By:  Tupaki Desk   |   4 July 2018 4:49 AM GMT
శృంగారం ఆ అమ్మాయి ప్రాణం తీసింది
X
దేనికైనా ఒక ప‌రిమితి ఉంటుంది. హ‌ద్దులు దాటే దూకుడుతో లేనిపోని తిప్ప‌లు త‌ప్ప‌వు. ఈ విష‌యాన్ని చెప్పేలా ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. శృంగార‌ క్రీడ‌లో ప్రియురాలి గొంతును బ‌లంగా ప‌ట్టుకున్న ప్రియుడి కార‌ణంగా ఒక యువ‌తి ప్రాణాల మీద‌కు తెచ్చింది.

ఇజ్రాయెల్‌ కు చెందిన 23 ఏళ్ల ఒరిరాన్ 21 ఏళ్ల త‌న ప్రియురాలిని తీసుకొని ముంబ‌యికి వ‌చ్చాడు. స్థానికంగా ఒక హోట‌ల్లో దిగాడు. అర్థ‌రాత్రి వేళ హ‌డావుడిగా వ‌చ్చిన అత‌డు.. త‌న ప్రియురాలు అచేత‌నంగా ప‌డి ఉందంటూ హోట‌ల్ సిబ్బందికి తెలిపి సాయం చేయాల‌ని కోరాడు.

ఈ ఉదంతంపై పోలీసులు సందేహంతో కేసు అనుమానాస్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేశారు. స‌ద‌రు మ‌హిళ మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వ‌చ్చింది. శృంగార స‌మ‌యంలో ప్రేయ‌సి మెడ‌ను ప్రియుడు బ‌లంగా ప‌ట్టుకొని ఉండ‌టం వ‌ల్ల ఊపిరి ఆడ‌క ఆమె మ‌ర‌ణించిన‌ట్లు గుర్తించారు. దీంతో ఒరిరాన్ పై కేసు న‌మోదు చేశారు. హ‌ద్దులు దాటే ఉత్సాహంతో చేసే శృంగారం ఒక్కోసారి ప్రాణాల్ని కూడా తీస్తుంద‌న్న‌ది తాజా ఉదంతం చెప్ప‌క‌నే చెబుతుంద‌ని చెప్పాలి.