Begin typing your search above and press return to search.
చంద్రయాన్ -3 సీన్లోకి వచ్చేసింది.. వచ్చే ఏడాదే ప్రయోగం
By: Tupaki Desk | 22 Sep 2019 6:06 AM GMTచేతికి అందినట్లే అంది.. చేజారిన చందమామ లెక్క సరి చేయటానికి వీలుగా ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. జాబిల్లి మీదకు వెళ్లే ప్రయత్నంలో చివరి క్షణంలో మిస్ అయిన అవకాశాన్ని.. మరో ప్రయత్నంలో సొంతం చేసుకునే పట్టుదలతో చంద్రయాన్-3 ఎప్పుడో చెప్పేశారు ఇస్రో ఛైర్మన్ కె. శివన్. తాజాగా భువనేశ్వర్ ఐఐటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో పాల్గొన్న శివన్ ఆసక్తికర ప్రకటనను చేశారు.
విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు నెలకొల్పేందుకు అవకాశాలన్ని మూసుకుపోయిన రోజునే.. శివన్ నోటి నుంచి చంద్రయాన్ -3 ప్రకటన రావటం గమనార్హం. ఏదైతే సాధించలేకపోయారో.. దాన్నే సాధించాలన్న పట్టుదల తాజా ప్రకటన సందర్భంగా శివన్ గొంతులో ఉందని చెప్పాలి. చంద్రయాన్ -3 ప్రయోగాన్ని అప్పుడెప్పుడో కాదు.. వచ్చే ఏడాది (2020)లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2021లో అంతరిక్షంలోకి ఇస్రో నిర్వహిస్తున్న గగన్ యాన్ ప్రయోగానికి ముందుగా 2020లో చంద్రయాన్ -3ను నిర్వహించటంతో పాటు.. గగన్ యాన్ కు ముందు మరో ప్రయాగానికి ఇస్రో రెఢీ అవుతోందని వెల్లడించారు.
విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు కోల్పోయిన అంశంలో ఫెయిల్యూర్స్ కు కారణాలు ఏమిటన్న అంశాన్ని తాము పరిశీలిస్తున్నట్లు చెప్పారు. చంద్రయాన్-2 విఫల ప్రయోగం ఎంతమాత్రం కాదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. చంద్రయాన్ -2 సక్సెస్ 98 శాతమన్న శివన్.. ఈ ప్రయోగంలో భాగంగా ఆర్బిటర్ లోని 8 పరిశోధక పరికరాలు చక్కగా పని చేస్తున్న విషయాన్ని చెప్పారు.
చంద్రయాన్ 2 ప్రయోగంలో తమ ప్లానింగ్ కారణంగా ఆర్భిటర్ జీవితకాలం ఏడాది నుంచి ఏడున్నరేళ్లకు పెరిగిన వైనాన్ని శివన్ వెల్లడించారు. 2020లో మానవరహిత ప్రయోగాన్ని నిర్వహించనున్న ఇస్రో.. 2021 జులైలో రెండో యాత్రను చేపట్టనున్నారు. 2021 డిసెంబరులో ఇస్రో తన సొంత రాకెట్ లో తొలి భారతీయుడ్ని రోదసిలోకి పంపనున్నట్లు వెల్లడించారు. తాజా వైఫల్యాన్ని పదే పదే గుర్తు చేసుకోవటం కన్నా.. దాని నుంచి పాఠాలు నేర్చుకొని ఫ్యూచర్ లో మరింత మిన్నగా ప్రయోగాలు నిర్వహించేందుకు అవసరమైన ప్లానింగ్ ఇస్రో వద్ద దండిగా ఉందన్న విషయాన్ని శివన్ తన మాటలతో చెప్పేశారని చెప్పాలి.