Begin typing your search above and press return to search.
చంద్రయాన్ 2 విఫలం..చివరి మెట్టులో సిగ్నల్ కట్
By: Tupaki Desk | 7 Sep 2019 4:56 AM GMTదేశం యావత్తు ఉత్కంఠతో ఎదురుచూసిన చంద్రయాన్ 2 ప్రయోగం విఫలమైంది. విజయాల బాటలో దూసుకెళుతున్న ఇస్రో చరిత్రలో... చంద్రయాన్ 2 కీలక ప్రయోగమనే చెప్పాలి. అయితే ఈ ప్రయోగం మొదలైన నాటి నుంచి ప్రతి దశనూ దిగ్విజయంగానే దాటుకుంటూ వెళ్లిన చంద్రయాన్ 2... చివరి దశలో, చందమామను తాకే సమయంలో విఫలమైంది. చంద్రుడి చెంతకు ల్యాండర్ విక్రమ్ దాదాపుగా చేరిపోయిందనుకుంటున్న సమయంలో చంద్రుడికి కేవలం 2.1 కిలో మీటర్ల దూరంలో విక్రమ్ తో కంట్రోల్ రూంకు సిగ్నల్స్ తెగిపోయాయి. అయినా కూడా పట్టువదలని ఇస్రో శాస్త్రవేత్తలు... విక్రమ్ తో సిగ్నల్స్ ను పునరుద్ధరించేందుకు తమ వంతు యత్నాలు చేశారు. అయినా కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ సాధ్యం కాలేదు. దీంతో చంద్రయాన్ 2 విఫలమైందని చెప్పక తప్పదు.
గత నెలలో ఈ ప్రయోగం మొదలైన నాటి నుంచి కూడా చంద్రయాన్ 2 ప్రతి దశను దాటుకుంటూ వెళ్లింది. అన్ని దశలనూ దిగ్విజయంగానే దాటుకుంటూ వెళ్లిన ఈ ప్రయోగం... చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ తాకే సమయంలో ఇబ్బంది వచ్చింది. ఈ తరహా ప్రమాదాన్ని ముందే ఊహించినట్టుగానే కనిపించిన ఇస్రో చైర్మన్ శివన్... చంద్రయాన్ 2లో అన్ని దశలను దాటుకుంటూ వెళ్లినా... చంద్రుడి ఉపరితలాన్ని విక్రమ్ తాకే 15 నిమిషాలు కీలకమని, మొత్తం ప్రయోగంలో ఈ 15 నిమిషాలే అత్యంత కీలకమని నిన్న సాయంత్రం ప్రకటించారు. దీంతో దేశం యావత్తు... ఈ 15 నిమిషాల సేపు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూసింది. ప్రధాని నరేంద్ర మోదీ... ఈ అరుదైన సన్నివేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు నేరుగా బెంగళూరు వెళ్లి... కంట్రోల్ రూంలో విద్యార్థులతో కూర్చుని మరీ వీక్షించారు. ఆ 15 నిమషాల వ్యవధిలో అటు ఇస్రో శాస్త్రవేత్తలతో పాటుగా ప్రధాని మోదీ కూడా తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. ఇక దేశ ప్రజలంతా ఈ కీలక సన్నివేశాన్ని తిలకించేందుకు టీవీలకే అతుక్కుపోయారు.
అయితే అందరి ఆశలను వమ్ము చేస్తూ విక్రమ్... చంద్రుడి ఉపరితలం ఇంకో 2.1 కిలో మీటర్లు ఉందనగా కంట్రోల్ రూంతో సిగ్నల్స్ పంపడం మానేసింది. సాంకేతిక లోపం కారణంగా విక్రమ్ తో కంట్రోల్ రూంకు తెగిపోయిన సిగ్నల్స్ ను పునరుద్ధరించేందుకు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్న అన్ని యత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఫలితంగా చంద్రయాన్ 2 విఫల ప్రయోగంగానే మిగిలిపోయింది. దేశం మొత్తాన్ని షాక్ కు గురి చేసింది. చంద్రయాన్ 2 విఫలం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు... ప్రత్యేకించి ఇస్రో చైర్మన్ శివన్ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ప్రధాని మోదీ... శివన్ ను తన గుండెలకు హత్తుకుని మరీ ఓదార్చారు. ఈ సన్నివేశం దేశ ప్రజలందరినీ కలిచివేసింది.