Begin typing your search above and press return to search.

నిప్పులు చిమ్ముతూ నింగిలోకి PSLV-C47 !

By:  Tupaki Desk   |   27 Nov 2019 4:53 AM GMT
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి  PSLV-C47 !
X
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుండి కార్టోశాట్-3 ని తీసుకోని , పీఎస్ఎల్వీ సీ-47 నిప్పులు విరజిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం 9.28కి ప్రయోగం జరుగగా, నాలుగు దశలు విజయవంతం అయ్యాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వాహక నౌకలో థర్డ్ జనరేషన్ హై రెజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ గా భావిస్తున్న కార్టోశాట్-3 అంతరిక్షంలోకి వెళ్లింది. 16 వందల 25 కిలోల కార్టోశాట్ తో కలిపి మొత్తం 14 ఉపగ్రహాల్ని పీఎస్ ఎల్ వీ -సీ 47 అంతరిక్షం లోకి తీసుకెళ్లింది.

దీనితో ఇస్రో ఖాతాలో మరో చిరస్మరణీయమైన విజయం జమైంది. రాకెట్ ని ప్రయోగించిన కేవలం 26.50 నిమిషాల వ్యవధిలోనే అన్ని ఉపగ్రహాలను వాటికి నిర్దేశించిన కక్ష్య ల్లో ప్రవేశపెట్టింది. చంద్రయాన్-2 విఫలమైన తరువాత ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇదే కావడంతో దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ ఉపగ్రహం తయారీ కి ఇస్రో 350 కోట్లు ఖర్చు మాత్రమే చేయడం విశేషం.

ఈ pslv -c47 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ మంగళవారం రోజు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తిరుమల శ్రీవారి ని కూడా దర్శించుకుని పూజలు చేశారు. తాజాగా ఈ ప్రయోగం విజయవంతం అవ్వడం తో ఇస్రో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.