Begin typing your search above and press return to search.

ఉత్తరధృవం వద్ద ఇస్రో గ్రౌండ్ స్టేషన్

By:  Tupaki Desk   |   4 Sept 2018 4:37 PM IST
ఉత్తరధృవం వద్ద ఇస్రో గ్రౌండ్ స్టేషన్
X
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్త ‘ఇస్రో’ తాజాగా అత్యంత శీతలంగా ఉండే ఉత్తర ధృవం వద్ద గ్రౌండ్ స్టేషన్ ను ప్రారంభించాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ఇక్కడ చైనా గ్రౌండ్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. కానీ ఇస్రో ఏర్పాటు ప్రతిపాదన వాస్తవ రూపం దాల్చాలంటే ఎన్నో అడ్డంకులున్నాయి. గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటుకు పలు అంతర్జాతీయ అనుమతులతోపాటు ఆయా దేశాల సహకారం అవసరం.. ఇందు కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టు ఇస్రో శాస్త్రవేత్త తెలిపారు.

ఉత్తర ధృవంలో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే ఇస్రోకు బోలెడు ప్రయోజనాలుంటాయి. భూమి చుట్టూ తిరిగే ఇస్రో ఉపగ్రహాలు ప్రతిసారి సమాచారం సేకరించి ప్రాసెస్ చేసి డేటా వ్యాప్తి చేసిస్తాయి. అయితే ఒకవైపునకు ఉంటే అవి కక్ష్యలో భూమి చుట్టూ తిరిగి వచ్చేసారికి కొన్ని ముఖ్యమైన డేటాను పంపడం మిస్ అవుతుంటుంది. అదే ఉత్తరధృవం వద్ద పైన యాంటెన్నె ఉంటే కక్ష్యలో ఉపగ్రహం ఎక్కడున్నా.. దాని సిగ్నల్ ఉత్తరధృవం గ్రౌండ్ స్టేషన్ కు అందుతాయి. దీని ద్వారా పౌరసేవలు, విపత్తు నిర్వహణ అంచనాలు.., భద్రతా బలగాలకు కూడా ఎంతో ప్రయోజనం.. అక్కడి నుంచి షాద్ నగర్ గ్రౌండ్ స్టేషన్ కు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ప్రపంచ దేశాల అవసరాలను తీర్చేలా ఎన్ఆర్ఎస్సీ, ఐఎమ్జీఈవో , అనే గ్రౌండ్ స్టేషన్ ఉంది. అలాగే 2013లో అంటార్కిటికాలో ఏజీఈవో అనే స్టేషన్ కూడా ఆ కొరత తీరుస్తోంది. ప్రస్తుతం ఇస్రో 14 ఆర్బిట్ కవరేజ్ కోసం ప్రయత్నం చేస్తోంది. దీనికోసమే ఉత్తర ధృవంలో గ్రౌండ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తోంది.