Begin typing your search above and press return to search.
మిస్టరీగా ఇస్రో శాస్త్రవేత్త దారుణహత్య
By: Tupaki Desk | 2 Oct 2019 4:55 AM GMTఇస్రో శాస్త్రవేత్త సురేష్ కుమార్ (56) దారుణహత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయనను హైదరాబాద్ లోని అమీర్ పేటలో అతి దారుణంగా చంపేశారు. అమీర్ పేట డీకేరోడ్డులోని అన్నపూర్ణ అపార్ట్ మెంట్ లో సురేష్ కుమార్ ఉంటున్న ఫ్లాట్ లోనే ఆయన హత్య జరిగింది. బాలానగర్ లోని ఇస్రో కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)లో సురేష్ కుమార్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
తమిళనాడుకు చెందిన సురేష్ కుమార్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. గత 20 ఏళ్లుగా అమీర్ పేటలోనే నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
సోమవారం సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన సురేష్ కుమార్ తన గదికి వెళ్లారు. తర్వాత బయటకు రాలేదు. మంగళవారం విధులకు హాజరు కాకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్ చేసిన ఆయన ఎత్తలేదు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. అనుమానం వచ్చి చెన్నైలో ఉంటున్న ఆయన భార్యకు సమాచారం అందించారు.
చెన్నై నుంచి భార్య, కుటుంబ సభ్యులు అమీర్ పేటకు వచ్చారు. పోలీసుల సమక్షంలో గదితాళం తెరిచి లోపలికి వెళ్లారు. అప్పటికే సురేష్ చనిపోయి ఉన్నాడు.
సురేష్ డెడ్ బాడీని పరిశీలించిన పోలీసులు.. ఆయన తలపై బలంగా బాదడంతోనే సురేష్ కుమార్ మృతిచెందాడని తేల్చారు. హత్య కేసు నమోదు చేసుకొని ఆ అపార్ట్ మెంట్ సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్త హత్య కావడంతో దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.