Begin typing your search above and press return to search.
20 శాటిలైట్లతో ‘‘మన’’ ప్రయోగం గ్రాండ్ సక్సెస్
By: Tupaki Desk | 22 Jun 2016 7:17 AM GMTభారత్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ వేదిక మీద భారతదేశ కీర్తి జెండా విజయగర్వంతో రెపరెపలాడింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. ఒకే ప్రయోగంతో 20 ఉపగ్రహాల్ని సక్సెస్ ఫుల్ గా పంపి రికార్డు సృష్టించారు. ఒకే రాకెట్ తో అత్యధిక ఉప గ్రహాల్ని పంపిన రికార్డు ఉన్నప్పటికి.. సాంకేతిక రంగంలో భారతదేశ సత్తాను తాజా ప్రయోగం చాటి చెప్పిందని చెప్పొచ్చు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కు తగ్గట్లే ఈ ఉదయం 9.26 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎన్ఎల్ వీ సీ 34ను విజయవంతంగా పరీక్షించారు.
అనుకున్న సమయానికి అనుకున్నట్లే ప్రయోగం సక్సెస్ కావటం అందరిని ఆనందోత్సహాల్లో మునిగిపోయేలా చేస్తోంది. తాజా ప్రయోగంతో భారత్ కు చెందిన కార్టోశాట్ 2సి.. దేశీయ విద్యా సంస్థలకు చెందిన రెండు ఉప గ్రహాలు.. అమెరికా.. కెనడా.. జర్మనీ.. ఇండోనేషియాలకు చెందిన 17 ఉప గ్రహాలను ఒకేసారి ప్రయోగించటం గమనార్హం.
తాజాగా ప్రయోగించిన ఉప గ్రహాల కారణంగా కలిగే కొన్ని లాభాల్ని చూస్తే..
= తాజా ప్రయోగం ద్వారా పంపిన కార్టోశాట్ 2 కారణంగా దేశ సైనిక సామర్థ్యం మరింత పెరగనుంది. సైనిక నిగాకు కీలకంగా ఉండే ఈ శాటిలైట్ సాంకేతికత ఇప్పటివరకూ అమెరికా.. చైనా.. ఇజ్రాయిల్ వద్దే ఉన్నాయి. తాజా ప్రయోగంతో ఆ జాబితాలో భారత్ ఒకటిగా మారనుంది.
= అంతరిక్షం నుంచి అత్యంత కచ్ఛితంగా ఫోటోలు.. వీడియోలు తీసి పంపే వీలుంది.
= తాజా ప్రయోగంతో సైనిక అవసరాలతో పాటు.. ప్రకృతి విపత్తులను అధిగమించే సేవల్ని అందించనుంది.