Begin typing your search above and press return to search.

అస్టోశాట్ పేరిట ఇస్రో మరో విజయం

By:  Tupaki Desk   |   28 Sept 2015 12:06 PM IST
అస్టోశాట్ పేరిట ఇస్రో మరో విజయం
X
స్వశక్తితో ఎదిగి.. విజయాల మీద విజయాలు నమోదు చేస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని నమోదు చేసింది. ఉపగ్రహాల పరీక్షల విషయంలో వరుస విజయాలు నమోదు చేయటంతో పాటు.. చౌకగా ఉపగ్రహాల్ని కక్షలో పంపే సంస్థగా ప్రపంచం వ్యాప్తంగా తనదైన బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజా ఈ సంస్థ ప్రయోగించిన అస్ట్రో శాట్ ను విజయవంతంగా నిర్ణీత కక్షలో ప్రవేశ పెట్టారు. ఇస్త్రోకు కలిసి వచ్చిన పోలార్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ ఎల్ వీ) సాంకేతికతతో ఏడు ఉపగ్రహాలను రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన రాకెట్ అస్ట్రోశాట్ తో సహా ఏడు ఉపగ్రహాల్ని నింగిలోకి తీసుకెళ్లింది. మొత్తం ఉపగ్రహాల బరువు 1630కిలోలు. ఖగోళ పరిశోధనలకు సంబంధించి తొలిసారి ప్రయోగించిన ఈ ప్రయోగం విజయవంతం కావటం శాస్త్రవేత్తల్లో ఆనందోత్సహాల్ని నింపింది. ఈ రాకెట్ తో పాటు అమెరికా.. కెనడా.. ఇండోనేషియాకు చెందిన ఉపగ్రహాలు కూడా ఉన్నాయి.

ఖగోళ పరిశోధనలపై ఇస్రో ప్రయోగించిన తొలి ఉపగ్రహంగా చెప్పొచ్చు. విశ్వం మూలల్ని తెలుసుకోవటంతో పాటు.. రేడియో ధార్మికత.. రోదసీ వాతావరణ అంశాలు.. గ్రహాలు.. నక్షత్రమండలాలపై ఈ ఉపగ్రహం పరిశోధనలు చేయనుంది. ఐదేళ్లు సేవలందించే ఈ ఉపగ్రహంతో ఎన్ని ఖగోళ రహస్యాలు బయటు వస్తాయో చూడాలి.