Begin typing your search above and press return to search.
భారతీయుల గ్రీన్ కార్డుల జారీ ఇక సులభమే..: బైడైన్ వద్దకు ఫైల్
By: Tupaki Desk | 18 May 2022 3:22 AM GMTఅమెరికాలో శాశ్వత నివాసం కోసం భారతీయులు ఇక ఇబ్బందులు పడనక్కర్లేదు. గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. శాశ్వత నివాసం కోసం అమెరికా జారీ చేసే గ్రీన్ కార్డ్ ఇష్యూపై ఉన్న పరిమితులను తొలగించేందుకు రంగం సిద్ధం అవుతోంది. యూఎస్ కాంగ్రెస్ హౌస్ జ్యూడీషియరీ కమిటీ అగ్రరాజ్య ఇమిగ్రేషన్ నిబంధనల్లోని ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రైంట్ వీసాల విషయంలో దేశాల వారీ పరిమితిని ఎత్తివేస్తున్నారు.
ఈ మేరకు సోమవారం జరిగిన కమిషన్ సమావేశంలో భారత అమెరికన్ల నాయకుడు అజయ్ జైన్ భుటోరియా ఈ అంశాన్ని లేవనెత్తాడు. దీంతో పెండింగ్ లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తులన్నీ ఆరునెలల్లోపు ప్రాసెస్ చేయాలని ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ కమిషన్ అధ్యక్షుడు జో బైడెన్ కు ఏకగ్రీవంగా సిపారసు చేసింది. దీంతో అమెరికాలో శాశ్వత నివాసం కోసం కలలు గంటున్న ఆశలు ఫలించాయనే చెప్పవచ్చు.
చదువు కోసం వెళ్లి ఉద్యోగం సంపాదించి అమెరికాలో స్థిరపడాలని భారతీయుల్లో చాలా మంది కలలుగంటుంటారు. ఇందులో భాగంగా శాశ్వత నివాసం ఏర్పరుచుకునేందుకు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటారు. భారత్ తో సహా పలు దేశాల యువత దీని కోసం పెద్ద ప్రయత్నమే చేస్తోంది. అయితే గ్రీన్ కార్డు ఇష్యూ కోసం ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే అది దక్కిన వారు చాలా కొద్ది మందే ఉంటారు. మిగతా వారు ఇప్పటికీ ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రీన్ కార్డు దరఖాస్తులను పెండింగులో ఉంచ్చవద్దని అమెరికా ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన అమెరికా అధ్యక్షుడి అడ్వైజరీ కమిషన్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో భారత సంతతి నాయకుడు అజయ్ భుటోరియా నేతృత్వంలో 25 మంది కమిషనర్లు గ్రీన్ కార్డు జారీపై ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం అధ్యక్షుడు బైడెన్ ఆమోదం కోసం పంపారు. బైడెన్ ఈ ఫైల్ పై ఒకే చెబితే ఇక భారతీయుల గ్రీన్ కార్డు కల ఫలించినట్లే.గ్రీన్ కార్డుతో పాటు ఫ్యామిలీ గ్రీన్ కార్డ్ అప్లికేషన్లు, డీఏసీఏ రెన్యూవల్స్, ఇతర అప్లికేషన్ల సమయాన్ని కూడా తగ్గించాలని సిఫార్సు చేశారు. వర్క్ పర్మిట్లు, ట్రావెల్ డాక్యుమెంట్లు, తాత్కాలిక పొడిగింపులు, ఇతర మార్పులను మూడు నెలల్లో పూర్తి చేసేలా ప్రతిపాదించారు.
భారత్ నుంచి హెచ్-1 బి మీద అమెరికాకు వెళ్లిన ఉద్యోగులు ప్రస్తుతం ఇమిగ్రేషన్ విధానం వల్ల అధికంగా నష్టపోతున్నారు. గ్రీన్ కార్డుల ఇష్యూలో ఒక దేశానికి 7 శాతం అనే నిబంధనతో భారత్ కు మరింత నష్టం జరుగుతోంది. దీంతో దరఖాస్తులు భారీగా పెండింగులో పడుతున్నాయి. 2021లో అందుబాటులో ఉన్న 2.26 లక్షల కార్డుల్లో 65,452 మాత్రమే మంజూరు అయ్యాయి.
గత ఏప్రిల్ నాటికి ఏకంగా 4,21,358 గ్రీన్ కార్డులు పెండింగులో ఉన్నాయి. ఈ విషయాన్ని భారత సంతతి వ్యక్తి అజయ్ భుటోరియా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ భారాన్ని తగ్గించేందుకు అమెరికా సిటిజన్ షిప్ అడ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పలు చర్యలు తీసుకోవాలని అడ్వైజరీ కమిషన్ కు సిఫార్సు చేసింది. దీంతో నేషనల్ వీసా సెంటర్ అదనపు సిబ్బందిని నియమించుకొని 2023 ఏప్రిల్ కల్లా 150 శాతానికి వీసాల జారీ పెంచాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.