Begin typing your search above and press return to search.

22 ఎకరాల వైసీపీ ఆసామి...ఓల్డేజ్ పెన్షన్ కోసం రచ్చ

By:  Tupaki Desk   |   20 Jan 2023 3:59 AM GMT
22 ఎకరాల వైసీపీ ఆసామి...ఓల్డేజ్ పెన్షన్ కోసం రచ్చ
X
ఆయన ఏకంగా ఇరవై రెండు ఎకరాల భూమికి ఆసామి. ఆస్తిపరుడు అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి జమీందార్ అని పేరు తగిలించాల్సిన వ్యక్తి. ఆయన తన పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తమకు ప్రభుత్వ పధకాలు కావాల్సిందే రావాల్సిందే అని భావిస్తున్నారు.

అంతే తన దగ్గరలోని గ్రామ సచివాలయానిని వెళ్ళి రచ్చ రచ్చ చేశారు. తన తల్లికి ఓల్డేజ్ పెన్షన్ ఎందుకు ఇవ్వరూ అంటూ గలాభా సృష్టించారు. ఇంతకీ ఆయన ఎవరంటే ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ నేత సూర్రెడ్డి సత్యనారాయణరెడ్డి. ఆయన తన తల్లికి పెన్షన్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు.

ఆయన మార్కాపురం గ్రామ సచివాలయానికి వెళ్ళి తన తల్లిని పెన్షన్ ఇవ్వరా అంటూ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. అక్కడ ఉద్యోగులని నానా మాటలు అంటూ గొడవ చేశారు. కుర్చీలని విసిరి పారేసాడు. ఇలా సచివాలయాన్ని రణరంగం చేసి సిబ్బందిని భయభ్రాంతులు చేశారు.

ఇంతచేసినా సిబ్బంది ఆయన్ని పల్లెత్తు మాట కూడా అనలేకపోయారు. దానికి కారణం ఆయన వైసీపీ నేత మాత్రమే కాదు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కందూరు నాగార్జున రెడ్డి బంధువు. అందుకే ఆయన ధాటిని అలా ప్రేక్షకుల మాదిరిగా చూస్తూ ఉండిపోయరు. ఇదేమని అడగలేక పోయాను. ఒక విధంగా భయపడ్డారు. ఇదంతా సచివాలయంలో జరిగింది.

అయితే సదరు వైసీపీ రెడ్డి గారు అక్కడ క్రియేట్ చేసిన సీన్ ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్ల విమర్శలకు కూడా నోచుకుంది. సత్యనారాయణరెడ్డి తల్లికి పెన్షన్ ఆ మధ్యదాకా ఇచ్చారు. రీ వెరిఫికేషన్ లో ఆమెకు భూమి ఉందని తేలడంతో అనర్హురాలిగా చూపిస్తూ పెన్షన్ కట్ చేశారు.

ఇది కేవలం వైసీపీ నేత తల్లి విషయంలోనే కాదు చాలా మంది విషయంలో జరిగింది. కానీ తాను అధికార పార్టీ మనిషిని అని తన ఫ్యామిలీకి ఏ విధంగా అయినా పెన్షన్ తీసుకునే అర్హత ఉందని సదరు రెడ్డి గారు భావించినట్లున్నారు. ఇంత గలాటా సృషించారు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రభుత నిబంధలనలకు లోబడి పెన్షన్ కట్ అయింది. కానీ ఇన్నాళ్ళూ చూసీ చూడకుండా నాలుగేళ్ళుగా పెన్షన్ ఇచ్చారు. మరి దాని సంగతేంటి అని నెటిజన్లు అడుగుతున్నారు.

అనర్హులు అని తేలింది కాబట్టి పాత పెన్షన్ రికవరీ చేయారా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి బాధ్యులను ఎవరిని చేస్తారు అని కూడా నిగ్గదీస్తున్నారు. మొత్తానికి ఇదొక అనర్హ పెన్షన్ కధ, రచ్చగా బయటకు వచ్చినా ఇంకా వేల లక్షలలో అనహర్గ పెన్షన్లు పధకాలు అలా వెళ్ళిపోతూ సర్కార్ ఖజానాకు చిల్లు పెడుతున్నాయని అంటున్నారు. మా ప్రభుత్వం మా పధకాలు మా ఇష్టం అని అనుకుంటే జనాలు మా ఓటు మా ఇష్టం అని అంటారని కూడా నెటిజన్ల నుంచి కామెంట్స్ పడుతున్నాయి.