Begin typing your search above and press return to search.
ఎంత కవర్ చేసినా.. ‘100 మీటర్ల’ దూరం నిజం దెబ్బేస్తుంది
By: Tupaki Desk | 20 Oct 2021 4:02 AM GMTఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒక జాతీయ పార్టీ (మేం అనటం లేదు చంద్రబాబు అంటున్నారు) ప్రధాన కార్యాలయంలోకి పెద్ద ఎత్తున జొరపడి.. కర్రలు.. భారీఎత్తున రాళ్లు.. సుత్తులు పట్టుకొని వచ్చి దాడి చేయటం.. ఆస్తుల్ని ధ్వంసం చేయటం.. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ భారీ ఎత్తున టెలికాస్టు అయిన వేళ.. ఏపీ అధికారపక్షానికి ఇబ్బంది కలిగించే అంశమే.
తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి దారుణమైన వ్యాఖ్యల ఫలితంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ ఏపీ అధికారపక్షం ఎంత కవర్ చేసుకున్నా.. జరిగిన దాడి.. దాంతో పాటు ఏపీలోని పలు చోట్ల టీడీపీ కార్యాలయాల మీద జరిగిన దాడిని ఎంత కవర్ చేసుకున్నా.. కవర్ కాని పరిస్థితిగా చెప్పక తప్పదు. రాజకీయంగా సవాలక్ష ఉండొచ్చు. దారుణ వ్యాఖ్యలు చేయొద్దు. ఘాటు విమర్శల వర్షం కురిపించొచ్చు. అర్థం లేని ఆరోపణలు చేయొచ్చు. ఏం చేసినా.. ఒక పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేయటాన్ని ఎవరూ సమర్థించలేరు.
అయితే.. విచిత్రంగా జరిగిన దాడికి సంబంధించి ఏపీ అధికారపక్షానికి చెందిన వారు ఎదురుదాడి చేస్తున్న వైనం షాకింగ్ గా మారింది. కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని తప్పు పడుతూ.. దాన్ని కవర్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. వీటి సంగతి ఎలా ఉన్నా.. పార్టీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ మీట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన ప్రసంగంలో ప్రస్తావించిన ఒక విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లటం ఖాయమంటున్నారు.
తమ పార్టీ ఆఫీసుపై జరిగిన దాడిని తీవ్రంగా తప్పు పట్టిన చంద్రబాబు.. తమ పార్టీ కార్యాలయానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే రాష్ట్ర డీజీపీ ఆఫీస్ ఉందన్న విషయాన్ని ఆయన ఒకటికి పదిసార్లు ప్రస్తావించారు. డీజీపీ ఆఫీసు వంద మీటర్ల దూరంలో ఉన్న వేళ.. పార్టీ ఆఫీసు మీద ఇలాంటిదాడి ఎలా చేస్తారన్న ఆయన సూటి ప్రశ్న ఏపీ అధికారపక్షాన్ని ఇరుకున పడేస్తుందన్న మాట వినిపిస్తోంది.
పార్టీ ఆఫీసు మీద భారీ ఎత్తున సాగిన దాడి వేళ.. కూతవేటు దూరంలో ఉన్న డీజీపీ ఆఫీసుకు చెందిన సెక్యురిటీ.. టీడీపీ ఆఫీసు మీద జరుగుతున్న దాడిని ఎందుకు నిలువరించలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి. ఎంత కవర్ చేసుకున్నా.. పార్టీ ఆఫీసుకు 100 మీటర్ల దూరంలోనే రాష్ట్ర డీజీపీ ఆఫీసు ఉన్నప్పటికి.. అల్లరిమూకలు చేస్తున్న దాడిని నిలువరించకపోవటం ప్రభుత్వానికి మచ్చగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.