Begin typing your search above and press return to search.

ధ‌ర్మాన‌-కొన్ని ప్ర‌శ్న‌లు-కొన్ని చిక్కులు...?

By:  Tupaki Desk   |   5 Jan 2023 4:48 AM GMT
ధ‌ర్మాన‌-కొన్ని ప్ర‌శ్న‌లు-కొన్ని చిక్కులు...?
X
వైసీపీ నాయ‌కుడు, శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు చుట్టూ కొన్ని ప్ర‌శ్న‌లు, మ‌రి కొన్ని చిక్కులు ముసురుకున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల‌తో స్వ‌యంగా ఆయ‌న చిక్కుల్లోప‌డ్డార‌నేది తెలుస్తోంది. విశాఖ‌నురాజ‌ధాని చేయాల్సిందేన‌నేది వైసీపీ వ్యూహం. దీనికి ఉన్న అడ్డంకులు తొల‌గించి అయినా.. ముందుకు సాగాల‌ని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే స‌మ‌యం కోసం వేచి చూస్తోంది.

అయితే.. ఇంత‌లోనే ధ‌ర్మాన బ్లాస్ట్ అయ్యారు. విశాఖ‌ను రాజ‌ధాని చేయ‌క‌పోతే.. ప్ర‌త్యేక రాష్ట్రం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇది వైసీపీని డిఫెన్స్‌లో ప‌డేసింది. ఎందుకంటే.. ఇప్ప‌టికే సీమ ప్రాంతాన్ని ప్ర‌త్యేక రాష్ట్రం చేయాల‌నే డిమాండ్‌లు ఉన్నాయి.

మ‌రోవైపు.. సీమ ప్రాంతంలో జిల్లాల‌ను త‌మ‌లో క‌లుపుకొనేం దుకు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఎదురు చూస్తోంది. సీమ‌లో ఎలాంటి ప‌రిణామాలు వ‌చ్చినా..త మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని చూస్తోంది.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలో ధ‌ర్మాన చేసిన వ్యాఖ్య‌లు.. వైసీపీని స‌హ‌జంగానే ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టాయి. మ‌రోవైపు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌బోన‌ని.. సీఎం జ‌గ‌న్‌కు చెప్పాన‌ని.. అయితే, ఆయ‌నే త‌న‌ను బ‌తిమాలార‌ని.. కూడా ధ‌ర్మాన వ్యాఖ్యానించారు. ఇది ఏకంగా అధిష్టానంపై అగౌర‌వాన్ని ప్ర‌ద‌ర్శించిన ట్టుగా ఉంద‌నేది పార్టీ వ‌ర్గాల మాట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని రంగంలోకి దింపాల‌నేది ధ‌ర్మాన వ్యూహం.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ ఎక్కువ‌గా ఉండ‌డం, ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌డంతో వార‌సుల‌కు జ‌గ‌న్ టికెట్ ఇచ్చేది లేద‌న్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న క‌ప్పిపుచ్చుకుని.. జ‌గ‌న్‌.. త‌న‌ను బ‌తిమాలారు.. అనే కోణంలో చెప్ప‌డం అంటే.. పార్టీకి అభ్య‌ర్థులు లేర‌నో..లేక పార్టీ త‌ర‌ఫున పోటీ చేసేవారు లేర‌నో అర్ధం వ‌చ్చేలా మాట్లాడార‌నేది పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే.. ధ‌ర్మాన వ్యూహం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీని మాత్రం ఇబ్బందిలోకి నెట్టారు.

ప్ర‌త్యేక రాష్ట్రం సాధ్యం కాద‌ని తెలిసి కూడా.. ఆయ‌న వ్యాఖ్యానించ‌డం.. స్థానికంగా ప్ర‌త్యేక రాజ‌ధానిని కోరుకోవ‌డం లేద‌నే సంకేతాల‌ను కూడా ఆయ‌న పంపిస్తున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది. ఏదేమైనా.. ధ‌ర్మాన వంటి సీనియ‌ర్ ఎన్నిక‌ల ముందు ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డాన్ని సీనియ‌ర్లు త‌ప్పుబ‌డుతున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.