Begin typing your search above and press return to search.

సోము సార్ ఏంటిది? ఏపీ బీజేపీలో కాక‌!!

By:  Tupaki Desk   |   19 Oct 2022 5:30 PM GMT
సోము సార్  ఏంటిది? ఏపీ బీజేపీలో కాక‌!!
X
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు భారీ దెబ్బ‌త‌గ‌ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా సీనియ‌ర్ నేత‌ల ప‌ట్ల‌.. వీర్రాజు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై.. నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు.. కాపుల‌ను పార్టీలో చేర్చుకుని.. పార్టీ పుంజుకునేలా చేయాల‌న్న‌.. ల‌క్ష్యంతోసోముకు ప‌గ్గాలు అప్ప‌గిస్తే.. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కరిని కూడా.. ఆయ‌న పార్టీలోకి తీసుకురాలేక పోయారు. మ‌రోవైపు.. ఉన్న‌వారు కూడా.. అసంతృప్తి జ్వాల‌లు ర‌గిలిస్తున్నా.. వారిని బుజ్జ‌గించేందుకు.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు సోము ఏమాత్రం ముందుకు రావ‌డం లేదు. దీంతో సీనియ‌ర్ నేత‌లు త‌ల్ల‌డిల్లుతున్నారు.

ఇక‌, తాజాగా జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో.. జ‌న‌సేన ఉన్న‌ట్టుండి.. బీజేపీకి దూరం కావ‌డాన్ని.. కాపు సామాజిక వ‌ర్గానికి.. చెందిన బీజేపీ నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీలో మిత్రుడిగా ఉన్న‌.. ప‌వ‌న్ వ‌ల్ల బీజేపీ పుంజుకుంటుంద‌ని.. రెండు క‌లిసి.. 15 శాతం ఓటు బ్యాంకును అయినా.. సాధించాల‌ని.. చాలా మంది నాయ‌కులు భావించారు. ఉభ‌య గోదావ‌రిజిల్లాల్లో పుంజుకునేందుకు ప‌వ‌న్ ఫొటోను వాడుకోవాల‌ని.. కూడా.. సూచించారు. అయితే.. ఆది నుంచి కూడా.. ఆయ‌న ఎవ‌రి మాటా విన‌ని సోము సీతయ్య‌గా వ్య‌వ‌హరించార‌నే టాక్ వినిపిస్తోంది.

పైగా.. కేంద్రం నుంచి వ‌చ్చే స‌మాచారాన్ని త‌మ‌కు ఇవ్వ‌లేద‌ని.. పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాల‌నే విష‌యంపై క్లార‌టీ ఇవ్వ‌లేద‌ని.. తాజాగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వంటి సీనియ‌ర్లు పేర్కొన‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింది.

అంతేకాదు.. అమ‌రావ‌తి రైతుల విష‌యంలోనూ.. ముందు.. ఒక ర‌కంగా.. త‌ర్వాత‌.. ఒక‌రకంగా.. సోము స్టాండ్ మార్చారు. ఈ ప‌రిణామం కూడా.. పార్టీలోని చాలా మందికి న‌చ్చ‌లేదు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పాద‌యాత్ర చేప‌ట్టిన రైతుల‌కు మ‌ద్ద‌తిద్దామ‌ని.. క‌న్నా, పురందేశ్వ‌రి, కామినేనివంటివారు సూచించినా..ఆయ‌న ప‌క్క‌న పెట్టార‌నే టాక్ ఉంది.

ఈ క్ర‌మంలో ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విష‌యం తెలుసుకుని.. సోము కు క్లాస్ ఇవ్వ‌డంతో అప్పుడు ప్ర‌కాశం జిల్లాలోకి చేరిన పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తుగా పాదం క‌దిపారు. ఆ త‌ర్వాత కూడా.. జ‌న‌సేన విష‌యంలో క‌లుపుకొని పోదామ‌న్నా.. సోము ప‌ట్టించుకోలేద‌నే టాక్ ఉంది. జ‌న‌సేన‌ను ప‌క్క‌న పెట్టి సొంత అజెండా అమ‌లు చేశార‌ని.. సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు హ‌ఠాత్తుగా జ‌నసేనాని తీసుకున్న నిర్ణ‌యంతో బీజేపీ చివురుటాకులా మారింద‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో సోము ను మార్చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అయితే.. వ‌చ్చేఎన్నిక‌ల వ‌ర‌కు త‌న‌కు అభయం లభించింద‌ని సోము ప్ర‌క‌టించుకున్నా.. పార్టీ పుట్టి మునిగిపోతున్న నేప‌థ్యంలో మార్పు త‌థ్య‌మ‌ని.. లేక‌పోతే.. మ‌రిన్ని వికెట్లు ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి కేంద్ర నాయ‌క‌త్వం ఏం చేస్తుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.