Begin typing your search above and press return to search.

ఇలాంటి నేత‌ల‌ను ఎందుకు వ‌దిలించుకోవ‌ట్లేదు? టీడీపీలో అంతర్మ‌థ‌నం

By:  Tupaki Desk   |   17 Jan 2023 2:30 PM GMT
ఇలాంటి నేత‌ల‌ను ఎందుకు వ‌దిలించుకోవ‌ట్లేదు? టీడీపీలో అంతర్మ‌థ‌నం
X
గ‌తంలోను, ఇప్పుడు కూడాటీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు నాయ‌కుల‌పై ఆధార‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపి స్తోంది. నిజానికి 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఒక కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీపై నాయ‌కులు ఆధార‌ప‌డేలా చేస్తాన‌ని.. ఆదిశగా పార్టీని న‌డిపిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. త‌ద్వారా పార్టీలో కొన్ని ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌ను నాయ‌కులు దాటిపోకుండా చూడాల‌నేది.. త‌న అధ్య‌క్ష పీఠాన్ని గౌర‌వించేలా చేయాల‌నేది చంద్ర‌బాబు ఆలోచ‌న‌.

ఈ ఆలోచ‌న బాగానే ఉంది. ఎందుకంటే.. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో నాయ‌కుల‌కు చంద్ర‌బాబు లొంగి పోయార‌నే కామెంట్లు వినిపించాయి. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది.. ఈ స్థానాల్లో నాయ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌ద్ద‌ని.. అనుకూల వ్య‌క్తులు, మీడియా కూడా ఘోషించాయి. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కుల వ‌ల‌కు చిక్కుకున్న చంద్ర‌బాబు రెబ‌ల్ గా మారితే.. మొత్తానికే కొంప‌ముంచుతుంద‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలోనే అంద‌రికీ టికెట్లు ఇచ్చారు.

ఇది పార్టీని తీవ్రంగా దెబ్బ‌తీసింది. ఇక‌, ఇప్పుడు 2024 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి త‌న వ్యూహం ప‌దును పెరుగుతుంద‌ని.. త్యాగాల‌కు సిద్ధంగా ఉండాల‌ని చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు.

అంటే.. ప్ర‌జ‌ల్లో సానుకూల త ఉన్న నాయ‌కుల‌కు మాత్ర‌మే పార్టీ టికెట్లు ఇస్తుంద‌నే సంకేతాలు పంపించారు. అయితే.. అది నిన్న‌టి మాట‌. కానీ, ఇప్పుడు ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు మ‌రోసారి త‌ల‌లు ఎగ‌రేస్తున్నారు. మాకెందుకు టికెట్ రాదో చూస్తాం అనే రేంజ్‌లో ఉన్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు .. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, విశాఖ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు, ఉమ్మ‌డి అనంత‌పురంలో జేసీబ్ర‌ద‌ర్స్, నెల్లూరులో బీద ర‌విచంద్ర‌యాద‌వ్‌.. ఇలా.. అనేక మంది నాయ‌కులు.. పార్టీలో తిరుగుబాటు ధోర‌ణిలోనే మాట్లాడుతున్నారు.

అంతేకాదు.. పార్టీని స‌మైక్య ప‌రిచే వ్యూహాల‌ను ప‌క్క‌న పెట్టి ఆధిప‌త్య‌రాజ‌కీయాలు చేస్తున్నారు. ఇదే ధోర‌ణి 2019 లో పార్టీని నిలువునా ద‌హించి వేసింద‌న్న బాబు.. మ‌రి వీరిని ఎందుకు ప‌క్క‌న పెట్ట‌డం లేద‌నేది ప్ర‌శ్న‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.