Begin typing your search above and press return to search.
స్టాలిన్, రవి గొడవ ఈ పదాల గురించేనా?
By: Tupaki Desk | 11 Jan 2023 7:44 AM GMTతమిళనాడులో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ కు, ఆ రాష్ట్ర గవర్నర్ రవికి మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. తాజాగా తమిళనాడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని గవర్నర్ రవి చదవని సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనకు పంపిన ప్రసంగంలో ద్రవిడ, కామరాజ్, పెరియార్, తమిళనాడు, అంబేడ్కర్ వంటి పదాలను గవర్నర్ చదవని సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో గవర్నర్ ఆ పదాలను ఎత్తేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా డీఎంకే మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడ్డ సంగతి తెలిసిందే. గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీ రికార్డుల్లో చేర్చవద్దని స్పీకర్ ను కోరడం.. ఇందుకు తీర్మానం ప్రవేశపెడుతుండగానే గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం తమిళనాట తీవ్ర కలకలం రేపాయి.
మరోవైపు తమిళనాడుకు 'తమిళగం' పేరు సరిగా సరిపోతుందని గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఇటీవల వ్యాఖ్యానించడం కూడా ప్రభుత్వానికి, ఆయనకు మధ్య గొడవకు కారణమని చెబుతున్నారు. ద్రవిడ రాజకీయాల్లో కొంత కాలంగా 'తమిళగం' అనే పదం చర్చనీయాంశమవుతోంది. అయితే, ఈ పదం వాడకంపై తమిళనాడు నేతలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి తమిళంలో.. తమిళనాడు అంటే 'తమిళ భూమి' అని అర్థమని అంటున్నారు. అలాగే.. తమిళగం అంటే 'తమిళుల నివాసం' అని చెబుతున్నారు. అయితే తమిళనాడు అనే పదాన్ని తమిళ జాతీయవాద కోణంలో చూసినప్పుడు అది దేశాన్ని సూచిస్తోందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు అంటే భారత్‌లో అంతర్భాగం కాదు.. దేశంలో భాగమైన ఓ స్వయం ప్రతిపత్తి ప్రాంతం అన్నట్టు ఉందని బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ నేతల వాదనలను అధికార డీఎంకే నేతలు కొట్టి పారేస్తున్నారు. 'తమిళనాడు' అనే పేరు.. తమ భాష, సంప్రదాయం, రాజకీయాలు, జీవితాన్ని çసూచిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ సోదరి, దివంగత సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ నేల ఎప్పటికీ తమిళనాడుగానే ఉంటుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు డీఎంకే అధికార పత్రిక 'మురసోలి' ఈ వివాదం నేపథ్యంలో ఇటీవల గవర్నర్ రవిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. 'తమిళనాడు అనేది ఒక సార్వభౌమ దేశాన్ని సూచిస్తుందని గవర్నర్ అన్నారు. అదే అయితే.. రాజస్థాన్ పేరు మీకు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లా అనిపిస్తోందా? మహారాష్ట్ర అనే పేరు 'మరాఠాల భూమి' అని అనిపించడం లేదా? కేరళ పర్యాటక నినాదం.. 'దేవుడి సొంత దేశం (గాడ్స్ ఓన్ కంట్రీ)' అని ఉంటుంది. మరి దీనికి ఏమంటారు' అంటూ మురసోలి పత్రిక గవర్నర్ రవికి పలు ప్రశ్నలు వేసింది.
కాగా.. 'తమిళగం' అనే పేరును 1938లో పెరియార్ ఈవీ రామస్వామి నాయకర్ మొదట తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. మద్రాస్ రాష్ట్రం పేరును మార్చే సమయంలో తమిళనాడు పేరు కూడా చర్చకు వచ్చిందని నాటి సంగతులను డీఎంకే నేతలు చెబుతున్నారు.
1967లో జూలై 18న సీఎన్ అన్నాదురై నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మద్రాసు రాష్ట్రానికి 'తమిళనాడు'గా పేరు మార్చాలని తీర్మానం చేసిందని గుర్తు చేస్తున్నారు. మద్రాస్ రాష్ట్రానికి తమిళనాడు అని పేరు పెట్టిన సందర్భంగా... 'తమిళనాడు భారత్‌లో భాగమైన రాష్ట్రం. పేరు కారణంగా ఇది స్వతంత్ర దేశం కాదు' అని అన్నాదురై స్పష్టం చేయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.