Begin typing your search above and press return to search.

ఏపీలో పంచాయ‌తీల‌కు ఇవి.. 'బాబులు' గురూ!!

By:  Tupaki Desk   |   10 Dec 2022 11:30 PM GMT
ఏపీలో పంచాయ‌తీల‌కు ఇవి.. బాబులు గురూ!!
X
ఏపీలో గ్రామ పంచాయ‌తీల‌కు వైసీపీ ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున క‌ల‌క‌లం రేగుతోం ది క‌దా! ఈ విష‌య‌మే ఎక్కువ మందికి తెలుసు. కానీ, దీనికి మించిన స‌మ‌స్య ఉంది. అది కూడా పంచాయ తీల‌కు బాబులు అని అనిపించేంత ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అవే, కార్పొరేష‌న్లు. పంచాయ‌తీల‌కే కాదు.. కార్పొరేష‌న్ల‌కు ఇవ్వాల్సిన నిధుల‌ను కూడా వైసీపీ ప్ర‌భుత్వం ఇవ్వ‌డం లేదు.

రాష్ట్రంలోని విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, క‌ర్నూలు, గుంటూరు, రాజ‌మండ్రి, ఒంగోలు, మ‌చిలీప‌ట్నం, క‌డ‌ప స‌హా అన్ని కార్పొరే ష‌న్ల‌ను గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ కైవ‌సం చేసుకుంది.

మెజారిటీ స్థానా లు అన్నీ కూడా.. వైసీపీ ప‌రం అయ్యాయి. కొన్ని కొన్ని కార్పొరేష‌న్ల‌ను అయితే క్లీన్ స్వీప్ చేసేసింది. ఇంకేముంది.. ఇక‌, కార్పొరేష‌న్ల‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ప్ర‌క‌టించారు.

కానీ, కార్పొరేష‌న్ల‌లో పాగా వేసి ఏడాది అయిన‌ప్ప‌టికీ రూపాయి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయా కార్పొరేష న్ల‌లోని వైసీపీ కార్పొరేటర్లు ల‌బోదిబో మంటున్నారు. వార్డుల్లో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌లేక పోతున్నామ‌ని వారు చెబుతున్నారు.

దీంతో మేయ‌ర్ల‌పై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. కౌన్సిల్ స‌మావేశాల్లో మేయ‌ర్ల‌ను కార్పొరేట్లు చుట్టుముడుతున్నారు. నిధులు ఇస్తారా? రాజీనామా చేయ‌మంటారా? అని తాజాగా క‌ర్నూలు కార్పొరేష‌న్‌లో మేయ‌ర్‌ను వైసీపీ కార్పొరేట‌ర్లు నిల‌దీశారు.

దీంతో ఆయ‌న ఈ విష‌యాన్ని ప్ర‌బుత్వం దృష్టికి తీసుకువెళ్తామ‌ని చెప్పి చేతులు దులుపుకొన్నారు. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు ఉండ‌డం.. పంచాయతీలను మించి కార్పొరేష‌న్ల‌కు కూడా నిధులు ఇవ్వ‌కుండా తాత్సారం చేయ‌డం వంటివి వైసీపీకి పెను విఘాతంగా మారుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అన్ని స‌మ‌స్య‌లు ఇలా పెట్టుకుని.. ఏం చేస్తారో చూడాల‌ని కార్పొరేట‌ర్లు కూడా పంతాని పోతుండ‌డం మొద‌టికే మోసం చేస్తుంద‌ని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.