Begin typing your search above and press return to search.
ఐటీ బిల్లును ఎలా పాస్ చేశారంటే..
By: Tupaki Desk | 30 Nov 2016 4:06 AM GMTప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది.పరిష్కారం లేని సమస్య అస్సలు ఉండనే ఉండదని చెబుతారు. ఈ వాదనను మోడీ పరివారం బలంగా నమ్ముతుందనే చెప్పాలి. సమస్యల చుట్టూ తిరుగుతూ.. దాని గురించి బుర్ర బద్ధలు కొట్టుకునే కన్నా.. సదరు సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కారం ఏమిటన్న దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్న వైనం కనిపిస్తుంది. ఇటీవల తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఆదాయపన్ను చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఏర్పడింది.
అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకునే మొత్తానికి భారీగా జరిమానా విధించటం.. వారికి షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకోవటానికి అనువుగా చట్టంలో సవరణలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి మార్పులకు అనుకూలంగా లేని పరిస్థితి. ఎందుకంటే.. లోక్ సభలో మోడీ సర్కారుకు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ.. రాజ్యసభలో మాత్రం అలాంటి పరిస్థితి లేని విషయం తెలిసిందే. ఇప్పటికి పెద్దల సభలో విపక్షాలదే అధిక్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందకపోతే అదోతలనొప్పి.
ఇదొక వ్యవహారమైతే.. మరో కీలకమైన అంశం ఏమిటంటే..తాను అనుకున్న రీతిలో బ్లాక్ మనీకి చెక్ పెట్టాలంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటీ చట్టానికి సవరణలు ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. రాజ్యసభలో బలం లేని సమస్యను అధిగమించేందుకు మోడీ సర్కారు మాస్టర్ ప్లాన్ వేసింది. విపక్షాల్ని బుజ్జగించి.. తన పని పూర్తి చేసే విషయాన్ని పక్కన పెట్టేసి.. చట్టంలోని చిన్న లొసుగును తనకు అనుకూలంగా మార్చుకుంది.
లోక్ సభ ఆమోదించిన ద్రవ్య బిల్లును.. కాదనకుండా పాస్ చేయాల్సిన బాధ్యత రాజ్యసభ మీద ఉంటుంది. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న మోడీ సర్కారు.. తాజాగా ఐటీ చట్ట సవరణ బిల్లును ద్రవ్య బిల్లుగా పేర్కొంటూ లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఐటీ సవరణ బిల్లును ద్రవ్య బిల్లుగా ఎలాపేర్కొంటారంటూ విపక్షాలు అలెర్ట్ అయి.. ప్రభుత్వంపై దాడి ప్రారంభించే సమయానికే ఆ బిల్లును లోక్ సభ ఆమోదం పలుకుతూ నిర్ణయం తీసేసుకున్నారు. ఊహించని పరిణామంతో విపక్షాలు ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఐటీ సవరణ బిల్లును ద్రవ్య బిల్లుగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటున్నప్పటికీ.. లోక్ సభలో ఆమోద ముద్ర పడిన ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదం వేయక తప్పనిసరి పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో.. ఈ బిల్లును పెద్దల సభ కూడా ఓకే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. బలం లేకున్నా.. సమస్యను పరిష్కరించుకుందామన్న ధైర్యంతో ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో మోడీ సర్కారు చేతల్లో చేసి చూపించారని చెప్పాలి.
తాజాగా లోక్ సభ పాస్ చేసిన బిల్లు చట్టంగా మారిన వెంటనే జరిగే ముఖ్యమైన మార్పులేమిటంటే..
= రద్దు అయిన పెద్దనోట్లను మారుస్తూ పట్టుబడిన వారిపై 60 శాతం పన్ను.. పెనాల్టీ కలిసి 85 శాతం వేయటం
= బ్యాంకులకు స్వయంగా బ్లాక్ మనీ వివరాలుఅందిస్తే 50 శాతం పన్ను విధించటం.. 25 శాతం వెంటనే వెనక్కి ఇవ్వటం.. మిగిలిన 25 శాతం మొత్తాన్ని నాలుగేళ్ల తర్వాత ఇవ్వటం
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/