Begin typing your search above and press return to search.
మునుగోడు గ్యాంబ్లింగ్ మొదలైనట్టే
By: Tupaki Desk | 18 Aug 2022 3:30 PM GMTతెలంగాణ వాకిట ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా కూడా అవి భారీ సంగ్రామాన్నే తలపిస్తున్నాయి. ప్రతి ఉప ఎన్నికకు వాటి స్థాయి ఎప్పటికప్పుడు పెరిగిపోతూ వస్తూ ఉంది. గతంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఇప్పుడు తాజాగా జరగబోతున్న మునుగోడు బై పోల్ సెషన్ కూడా అలానే ఉంది. అప్పుడే బేరసారాలు, రాయబారాలు మొదలయిపోయాయి.
ఓటరన్నతో బేరం, సర్పంచ్ తో బేరం, తోటి పార్టీ వ్యక్తులతో పందెం ఏ విధంగా చూసుకున్నా డబ్బులతో జూదం బాగానే నడుస్తుంది. దీనిని పొలిటికల్ గ్యాంబ్లర్స్ బాగానే వాడుకుంటున్నారు. అంటే ఓ చోట జూదం నేరం కానీ రాజకీయ జూదం మాత్రం చట్టాలకు అతీతం.
శిక్షలకు అతీతం. కొన్ని నేరుగా సాగుతుంటే కొన్నిపథకాల రూపంలో తాయిలాల రూపంలో సాగుతున్న క్రమం ఒకటి అత్యంత హేయం. ఈ నిర్దయాపూర్వకం అయిన స్థితి గతంలో ఉంది. ఇప్పుడూ ఉంది. ఒక సర్పంచ్ ధర ఇరవై లక్షలు అని తేలింది. మరి ! ఒక ఓటు ధర 5 నుంచి పది వేలు అని తేలింది. అంటే ఇది కూడా ఓ వంద కోట్ల ఎలక్షన్ అని తేలిపోయింది.
అంటే తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలకూ రేపటివేళ ఎన్నిక ఉంటే ఇంకెంత కావాలి? అయితే ఉప ఎన్నికకు అయినంత ఖర్చు అపుడు కాకపోవచ్చు. కానీ నియోజకవర్గానికి 50 కోట్లయితే గ్యారంటీ అన్నది తేలిపోయింది.
సుమారు 6 వేల కోట్లు తప్పని సరి ! ఇది ఒక పార్టీ చేసే ఖర్చు లెక్క. ప్రధానంగా ఉన్న మూడు పార్టీలూ ఖర్చు చేస్తే ఇదే స్థాయిలో ఇంతే మొత్తంలో ఇదే విధంగా ఓటరును ఆకట్టుకుంటే అప్పుడు లెక్క ఎంతౌతుంది.
35,700 కోట్ల రూపాయలు అవుతాయని అంచనా ! అంటే ఎన్నికలు ఇంత కాస్ట్లీ గా మారిపోతున్నాయి. దేశ అత్యున్నత న్యాయ స్థానం కూడా ఉచితాలపై ఏమీ తేల్చి చెప్పలేం అని అంటోంది ఇవాళ. అలాంటప్పుడు ప్రజలకు ప్రశ్నించే అధికారం ఉంటుందా ? డబ్బులకు అమ్ముడు పోయి అభివృద్ధి లేదు నాయినోయ్ అని ఎవ్వరైనా సిన్సియర్ గా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు లేదా ఆ అరుపుకు విలువ ఉంటుందా ? ఇదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది.