Begin typing your search above and press return to search.

సీఎం మేనల్లుడు ఆస్తుల్ని అటాచ్ చేసేశారు

By:  Tupaki Desk   |   30 July 2019 11:37 AM GMT
సీఎం మేనల్లుడు ఆస్తుల్ని అటాచ్ చేసేశారు
X
ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి ఆయనకుండే పవర్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలా ముఖ్యమంత్రిగారి మేనల్లుడి ఆస్తుల్ని సైతం విచారణాధికారులు స్వాధీనం చేసుకున్న వైనం ఇప్పుడా రాష్ట్రంలో సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు కమ్ రతుల్ పూరికి చెందిన రూ.254 కోట్ల మొత్తాన్ని బినామీ ప్రొహిబిషన్ యూనిట్ స్వాధీనం చేసుకుంది. అక్రమ పద్ధతిలో ఈ ఆస్తుల్ని కూడబెట్టినట్లుగా అధికారులు ఆరోపిస్తున్నారు.

ఆగస్టా వెస్ట్ లాంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా రాజేష్ సక్సేనా ద్వారా ఎఫ్ డీఐల రూపంలో అక్రమ నగదు దేశానికి తీసుకొస్తున్నట్లు చెప్పటం ద్వారా ఆయన్ను ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. తాను రాజకీయ బంధువేనన్న ఉద్దేశంతో మోడీ సర్కారు తన దగ్గరున్న అధికారుల చేత దాడులు చేయిస్తున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

అగస్టా ఒప్పందంతో లంచాలు ఇచ్చి పరిశ్రమను తెలంగాణకు తీసుకొచ్చారన్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ ఒప్పందం తర్వాత సొమ్మును ఎలా దారి మళ్లించారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏ రోజుకైనా కొంప ముంచే ప్రమాదం పొంచి ఉన్న అగస్టా ఒప్పందానికి సంబంధించిన అంశాల్ని పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న సీఎం కమల్ నాథ్..మేనల్లుడి ఆస్తుల మీద దాడి జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ నెల 27న రతుల్ ఫురి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణలో.. దర్యాఫ్తునకు ఆయన తన సహకారం అందించటం లేదని విచారణాధికారులు వాదిస్తున్నారు. మరి.. ఈ కేసుకు సంబంధించి బెయిల్ దరఖాస్తును ప్రస్తుతం ఢిల్లీ కోర్టు విచారిస్తోంది. మరి.. న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.