Begin typing your search above and press return to search.
కోలీవుడ్ లో ఐటీ దాడుల కలకలం!
By: Tupaki Desk | 2 Aug 2022 7:32 AM GMTఇప్పుడు ఎక్కడ చూసినా ఏ సెలబ్రిటీని కదిలించినా.. ఏ రాజకీయ నాయకుడిని వాకబు చేసినా వినిపిస్తున్న పేరు ఐటీ, ఈడీ రైడ్స్. ఇటీవల ఎక్కడ అవినీతి, పన్ను ఎగవేత దారులు వున్నారని వారి దృష్టికి వచ్చినా మరుక్షణమే అక్కడ ఐటీ రైడ్స్ ని నిర్వహిస్తున్నారు. ఇదిలా వుంటే మంగళవారం ఐటీ దాడులు కోలీవుడ్ లో తీవ్ర కలకలం సృష్టించాయి. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.
చెన్నై, మధురైలోని 40కి పైగా ప్రదేశాల్లో పలువురు కీలక వ్యక్తుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వమిస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుంచే పలువురు నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన ఇళ్లలో ఐటీ శాఖ దాడులు నిర్వహించడం మొదలు పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. వి క్రియేషన్స్ అధిరనేత కలైపులి ఎస్ ధాను, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధినేత ఎస్.ఆర్ ప్రభు, అన్భు చెగియాన్, స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ. జ్ఞానవేళ్ రాజా తో పాటు పది మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇళ్లలో ఐటీ దాడులు నిర్విహించినట్టుగా తెలుస్తోంది.
ఇక చెడియాన్ నివాసంతో పాటు ఆయనకు చెందిన గోపురం సినిమా కార్యాలయంపై కూడా దాడులు జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. చెగియాన్ పై ఐటీ దాడులు జరగడం ఇది మూడవ సారని చెబుతున్నారు. గతంలో అంటే 2020లో అన్బు చెగడియాన్ కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలు లక్ష్యంగా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన `బిగిల్` సినిమా రిలీజ్ సమయంలో చెగియాన్ పై ఈ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ఐటీ శాఖ జరిపిన దాడుల్లో రూ. 65 కోట్ల మేర సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో తమిళ స్టార్ హీరో విజయ్‌తో పాటు మరి కొంత మంది కోలీవుడ్ నిర్మాతలపై ఐటీ శాఖ నిఖా పెట్టింది. ఓ దశలో హీరో విజయ్ నివాసంలోనూ ఐటీ శాఖ సోదారు నిర్వహించడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి హీరో విజయ్ కి అండగా నిలిచారు.