Begin typing your search above and press return to search.

ఫీనిక్స్ కంపెనీలో ఐటీ దాడులు.. ఆందోళనలో నేతలు

By:  Tupaki Desk   |   23 Aug 2022 9:30 AM GMT
ఫీనిక్స్ కంపెనీలో ఐటీ దాడులు.. ఆందోళనలో నేతలు
X
హైదరాబాద్ లోని ఆ ప్రముఖ కంపెనీపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ఫీనిక్స్ కంపెనీలో ఐటీ దాడులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇదో ఇన్ ఫ్రా కంపెనీ. ఈ కంపెనీకి భారీగా వెంచర్లు, రియల్ ఇన్ ఫ్రోలో పెట్టుబడులు ఉన్నాయి. ఫీనిక్స్ ఐటీ సెజ్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫీనిక్స్ కు సంబంధించి 10 ప్రాంతాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. సంస్థ చైర్మన్ తోపాటు డైరెక్టర్ల నివాసాల్లోనే రైడ్స్ జరుగుతున్నాయి.

ఇక ఫీనిక్స్ తో కొంత మంది ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐటీ రైడ్స్ తో ఆ నేతలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది.

రియల్టీ కంపెనీ ఫీనిక్స్‌పై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం ఉదయం దాడులు ప్రారంభించింది. మరో ఇద్దరు రియల్టీ మేజర్లు వాసవీ గ్రూప్ , సుమధురపై ఇటీవల జరిగిన ఇలాంటి దాడుల కొనసాగింపుగా ముంబై నుండి ఒక ప్రత్యేక బృందం దాడులు నిర్వహించేందుకు నగరానికి వచ్చింది. ముఖ్యంగా కూకట్‌పల్లిలో భూముల విక్రయానికి సంబంధించి ఫీనిక్స్‌కు, రెండు కంపెనీలకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు మీడియాకు ఉన్నత వర్గాలు తెలిపాయి.

ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ భూములను.. ఈ కంపెనీ ఏజెన్సీలు క్లెయిమ్ చేసినట్టు ఆరోపణలున్నాయి. ప్రధాన భూములను చేజిక్కించుకున్నాయని ఈ కంపెనీపై అపఖ్యాతి పొందింది. ఈ సంస్థ ప్రస్తుతం చైర్మన్ చుక్కపల్లి సురేష్ యాజమాన్యంలో నడుస్తోంది. మేనేజింగ్ డైరెక్టర్ గా గోపి కొనసాగుతున్నారు.

వైఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐడీఎల్ నుండి కొనుగోలు చేసిన భూములపై దుమారం రేగింది. ఫీనిక్స్ జోక్యం కారణంగా ఫైల్ కొంత కదిలిందని.. ఆ కంపెనీకి భూములు వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీ మళ్లీ వాసవి-సుమధుర జెవిలకు ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములను కొనుగోలు ధర కంటే ఎక్కువ ధరకు విక్రయించిందన్న ఆరోపణలున్నాయి.

నిర్మాణంలో ఉపయోగించిన వస్తువులను ఫీనిక్స్ కొనుగోలు చేయడంపై ఐటీ అధికారులు నజర్ వేసి ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. కీలకమైన ఇన్‌పుట్‌లు అందినట్టు తెలుస్తోంది. ఈ లావాదేవీల వాస్తవికతను నిర్ధారించడానికి ఐటీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది.