Begin typing your search above and press return to search.
క్రిస్మస్ వేళ.. అమెరికాలో మంచు తుఫాను..!
By: Tupaki Desk | 23 Dec 2022 5:17 PM GMTఅమెరికా క్రిస్మస్ సంబరాలు మొదలైన క్రమంలోనే మంచు తుఫానుతో వాతావరణ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. ఉన్నట్టుండి మంచు కురుస్తుండటంతో వాతావరణం జీరో డిగ్రీలకు పడిపోయింది. పొగ మంచు కారణంగా గురువారం ఒక్క రోజే వేలాది విమానాలు రద్దయ్యాయి. దీంతో వాహనదారులు.. ప్రజలు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు.
అమెరికాలో భారీగా కురుస్తున్న మంచుతో ప్రజలంతా గజగజ వణికిపోతున్నారు. స్థానిక ఉష్ణోగ్రతలు మైసన్ 40 డిగ్రీలకు పడిపోయాయి. దట్టమైన మంచుతో రోడ్లన్నీ నిండిపోవడంతో రోడ్లన్నీ మూతపడుతున్నాయి. మధ్య అమెరికాలో హిమ తుఫాను హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది. ప్రధానంగా మిన్నియాపోలిస్.. సెయింట్ పాల్.. న్యూయార్క్.. షికాగో ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.
ఈ క్రమంలోనే ప్రజలంతా జాగ్రత్త ఉండాలని దేశ అధ్యక్షుడు జో బైడెన్ సైతం సూచిస్తున్నారు. బయట వాతావరణం చల్లగా ఉందని జాగ్రత్తలు లేకుండా బయటకు వస్తే నిమిషాల్లో గడ్డకట్టుకుని పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు 'బాంబు సైక్లోన్' గా బలపడే అవకాశం ఉందని అక్యూవెదర్ సంస్థ వెల్లడించింది.
దీంతో న్యూయర్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఇతర ప్రాంతంలోని గవర్నర్లతో కలిసి స్థానికంగా అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దట్టమైన పొగ కారణంగా ప్రజలు ప్రస్తుతానికి రోడ్డు మార్గంలో ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రోడ్లన్నీంటిని అధికారులు మూసివేస్తున్నారు.
ఇక విమానాలను ట్రాక్ చేసే వెబ్ సైట్ 'ఫ్లైట్ అవేర్' ప్రకారంగా అమెరికా గురువారం దాదాపు 22 వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచినట్లు పేర్కొంది. 5 వేల 500 విమానాలు ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాలో మంచు తుఫాను ధాటికి క్రిస్మస్ సంబురాలు కళ తప్పే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.