Begin typing your search above and press return to search.
అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోం తప్పదంటున్న బడా కంపెనీలు
By: Tupaki Desk | 9 July 2021 7:30 AM GMTకరోనా కంగారు మూలాన చాలా ఐటీ కంపెనీలు తమ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. దాదాపు ఏడాది పై నుంచే చాలా మంది ఐటీ రంగంలోని ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నారు. కొన్ని కంపెనీలయితే ఈ వర్క్ ఫ్రం హోం విధానం బాగుందని కూడా ప్రకటించాయి. కానీ ఇటీవల తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం ఎత్తేయాలని ఆదేశాలు జారీ చేసింది. రిటర్న్ టూ ఆఫీస్ కు అందరూ రావాలని పేర్కొంది. కానీ కొంత మంది ఐటీ నిపుణులు ఇంత త్వరగా ఇది సాధ్యమయ్యే పని కాదని పెదవి విరుస్తున్నారు. అసలు ఐటీ రంగ నిపుణులు విముఖత ఎందుకు చూపుతున్నారంటే.....
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనే ఐటీ కంపెనీలన్నీ తమ తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే సౌలభ్యాన్ని కల్పించాయి. కరోనా ఫస్ట్ వేవ్ పరిస్థితులు చల్లబడ్డాక ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి లో కొంత మందిని ఆఫీసులకు రప్పించారు. ఏప్రిల్ చివరి నాటికి క్రమంగా అందరినీ రప్పిద్దామని అనుకునే లోపే... కరోనా సెకండ్ వేవ్ వచ్చి... వారి అంచనాలను తలకిందులు చేసింది. దీంతో చేసేదేం లేక కంపెనీలన్నీ మరలా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించాయి. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం అందరు ఉద్యోగులు రిటర్న్ టూ ఆఫీస్ బాట పట్టాలని చెబుతోంది.
కానీ ఐటీ వారు దీనికి ససేమిరా అంటున్నారు. మార్చిలో ప్రభుత్వ ఆదేశాలు పాటించి తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తే... వారు కేవలం నెల రోజులు కూడా పనులు చేయకుండానే మరలా పంపాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంటున్నారు. మొత్తం కరోనా కంగారు తగ్గాకే తమ ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేలా ఆదేశాలు ఇస్తామని చెబుతున్నారు. మరో పక్క ఐటీ రంగంలో దాదాపు ఆరు లక్షల మందికి ఇప్పట్లో ఆఫీసుకు వచ్చి పనులు చేయడం ఇష్టం లేదని ఓ సర్వేలో వెల్లడైంది.
దీంతో ఆలోచనలో పడ్డ ఐటీ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వం ఆదేశాలు ఎలాగైనా జారీ చేయని కానీ తాము మాత్రం వర్క్ ఫ్రం హోం ఆప్షన్ నే కంటిన్యూ చేస్తామని చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల తమ ఉద్యోగుల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడదని చెబుతున్నాయి. మరి వేచి చూడాలి ఐటీ కంపెనీల మాట నెగ్గుతుందో లేక ప్రభుత్వ పెద్దల మాట నెగ్గుతుందో..