Begin typing your search above and press return to search.

మల్లారెడ్డి సంస్థల్లో ఉద్యోగులుగా ఐటీ శాఖ అధికారులు

By:  Tupaki Desk   |   26 Nov 2022 6:35 AM GMT
మల్లారెడ్డి సంస్థల్లో ఉద్యోగులుగా ఐటీ శాఖ అధికారులు
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఐటీ దాడులు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సెగకు కారణమైన సంగతి తెలిసిందే. ఇంతవరకు జరిగిన కేంద్రం - రాష్ట్రం పంచాయితీని మరో లెవల్ కు తీసుకెళ్లిన క్రెడిట్ తాజా తనిఖీలకు దక్కుతుందని చెప్పాలి.

రెండు రోజుల పాటు సాగిన ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు ఒక పద్దతిగా సాగటమే కాదు.. తమకు అవసరమైన సమాచారాన్ని చేజిక్కించుకోవటంలో ఐటీ శాఖ సక్సెస్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే.. అదెలా సాధ్యమైంది? దాని వెనుక జరిగిన కసరత్తు ఏమిటి? లాంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

దీనిపై లోతుగా ఫోకస్ చేస్తే.. సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మల్లారెడ్డి కుటుంబానికి దాదాపుగా 35 కు పైగా విద్యా సంస్థలు ఉండటంతో.. వాటిల్లో కీలక విభాగాల్లో కింది స్థాయి ఉద్యోగులుగా ఐటీ శాఖ అధికారులు చేరినట్లుగా తెలుస్తోంది. దాదాపు నాలుగైదు నెలలుగా ఉద్యోగులుగా నటిస్తూ తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో తనిఖీల వేళ.. తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించటం చాలా ఈజీగా జరిగినట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల్లో ఎవరిని లక్ష్యంగా చేసుకుంటే సమాచారం వస్తుందన్న వివరాల్ని ముందే సేకరించి పెట్టుకోవటంతో పాటు.. వారిని ఎలా డీల్ చేస్తే సమాచారం బయటకు కక్కుతారన్న వివరాల్ని సదరు ఉద్యోగులు సమాచారాన్ని అందించినట్లుగా చెబుతున్నారు. అన్నింటి కంటే అసలు ట్విస్టు ఏమంటే..

ఐటీ సోదాలు జరగటానికి కొద్ది రోజుల ముందే తమ ఉద్యోగాలకు రాజీనామా చేసేసి వెళ్లినట్లుగా తెలుస్తోంది. భారీగా ఉన్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో తరచూ కొత్త ఉద్యోగులు రావటం.. పాతవాళ్లు వెళ్లటం అనేది నిరంతరం సాగే ప్రక్రియ కావటంతో.. ఐటీ టార్గెట్ గురించి అంచనా వేయలేకపోయినట్లుగా చెబుతున్నారు.

అదే ఐటీ అధికారులకు అవకాశంగా మారిందని.. పక్కా ప్రణాళికతో.. భారీ కసరత్తు చేసిన తర్వాతే తనిఖీలునిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారటమే కాదు.. ఐటీ అధికారుల తెర వెనుక ప్రయత్నాలు ఇంతలా ఉంటాయా?అన్న విస్మయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.