Begin typing your search above and press return to search.
ఆ రెండు ప్రముఖ మొబైల్ కంపెనీలకు భారీ ఫైన్.. తప్పేం చేశాయంటే?
By: Tupaki Desk | 1 Jan 2022 4:56 AM GMTఅవేమీ అల్లాటప్పా కంపెనీలు కావు. ప్రముఖ కంపెనీలు. కేవలం తమ బ్రాండ్ ప్రమోషన్ కోసమే కోట్లాది రూపాయిల్ని మంచినీళ్ల మాదిరి ఖర్చు చేసే లక్షణం ఆ ప్రముఖ మొబైల్ కంపెనీలకు అలవాటు. అలాంటి కంపెనీలు కక్కుర్తి పడతాయని కలలో కూడా అనుకోం. అందుకు భిన్నంగా.. ఆ రెండు కంపెనీలు ఆదాయపన్నుశాఖకు పన్ను ఎగవేతకు ప్లాన్ చేయటం.. తాజాగా అడ్డంగా బుక్ కావటం సంచలనంగా మారింది. .ఇంతకీ ఆ రెండు ప్రముఖ మొబైల్ కంపెనీలు మరేవో కాదు.. ఒకటి ఒప్పో అయితే.. మరొకటి షావోమీ కంపెనీ. ఈ రెండు కంపెనీలు కాకుండా వన్ ప్లస్ ఉద్యోగి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఐటీ చట్టాల్ని ఉల్లంఘించిన షావోమీ.. ఒప్పో కంపెనీల మీద రూ1000 కోట్లకు పైగా ఫైన్ విధించే వీలుందన్న మాట ఐటీ శాఖ వెల్లడించింది. పన్ను ఎగవేతకు సంబంధించి కర్ణాటక.. తమిళనాడు.. అసోం.. పశ్చిమ బెంగాల్.. ఏపీ.. మధ్యప్రదేశ్.. గుజరాత్.. మహారాష్ట్ర.. బిహార్.. రాజస్థాన్.. ఢిల్లీలోని షావోమీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మొబైల్ కంపెనీలు చట్టబద్ధంగా కట్టాల్సిన ఐటీ పన్నును కట్టకుండా.. తాజాగా జరిపిన తనిఖీలు స్పస్టం చేస్తున్నాయి.
తనిఖీల సందర్భంగా కంపెనీ అధికారులను ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఈ కంపెనీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే.. షావోమీ.. ఒప్పో కంపెనీలు రాయల్టీ రూపంలో విదేశాల్లో ఉన్న వాటి గ్రూపు కంపెనీలకు రూ.5500 కోట్లకు పైగా ఉన్న భారీ మొత్తం చెల్లింపులు జరిపినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. ఆదాయపన్ను చట్టం.. 1961లో సూచించిన ఆదేశాల్ని ఈ కంపెనీ పాటించలేదని.. అందుకు తగ్గట్లు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అంచనాలు నిజమైతే.. ఈ ప్రముఖ మొబైల్ కంపెనీలు దాదాపు రూ. వెయ్యి చొప్పున ప్రభుత్వ ఖజానాకు దెబ్బ తీసేలా వ్యవహరించటం చూస్తే.. ఈ రెండు కంపెనీలకు దిమ్మ తిరిగేలా పన్ను పోటును విధించాల్సిన బాధ్యత ఐటీ అధికారుల మీద ఉంది. ఈ కంపెనీలేవీ 1961లో సూచించిన ఆదేశాల్ని పాటించలేదన్న విషయం తాజాగా బయటకు వచ్చిందని చెప్పాలి.