Begin typing your search above and press return to search.

మంత్రి జగదీశ్ రెడ్డికి వరుస షాకులు.. మొన్న ఈసీ.. నేడు ఐటీ

By:  Tupaki Desk   |   1 Nov 2022 4:11 AM GMT
మంత్రి జగదీశ్ రెడ్డికి వరుస షాకులు.. మొన్న ఈసీ.. నేడు ఐటీ
X
తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డికి వరుస ఎదురుదెుబ్బలు తగులుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే ఆయనకు రెండు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షాక్ తగఅటం.. ఆయన్ను 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సోమవారం రాత్రి వేళలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన వద్ద పీఏగా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రెడ్డి నివాసంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టటం కలకలాన్ని రేపుతోంది. సాయంత్రం ఆరు గంటల వేళలో.. ఐటీ సోదాలు మొదలైనా.

ఆ సమాచారం రాత్రి ఎనిమిది గంటల వరకు బయటకు రాలేదు. దాదాపు ఐదు గంటల పాటు తనిఖీలు నిర్వహించిన ఐటీ శాఖ.. రాత్రి 11.15 గంటల వేళ వరకు తనిఖీలు నిర్వహించారు.

సోదాలకు ముందు స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారాన్ని అందించకుండా ఐటీ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం. దాడుల వేళలో దాదాపు పదిహేను మంది అధికారులు పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి పీఏ ఇంట్లో భారీ ఎత్తున నగదు దాచినట్లుగా అనుమానిస్తున్నారు.

ఇందులో భాగంగా తనిఖీలు జరగ్గా.. పలు డాక్యుమెంట్లతో పాటు.. కంప్యూటర్ హార్డ్ డిస్కులు.. పెన్ డ్రైవ్ లు.. డైరీలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన ఐదు రోజులుగా మంత్రి జగదీశ్ కు ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఎదురుదెబ్బలు తగులుతున్నట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.