Begin typing your search above and press return to search.

ఐటీ దూకుడు.. ఇక స‌మ‌ర‌మే..

By:  Tupaki Desk   |   29 Dec 2016 8:17 AM GMT
ఐటీ దూకుడు.. ఇక స‌మ‌ర‌మే..
X
పెద్ద నోట్లను రద్దు ప్రకటన తర్వాత తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వదిలించుకోవడానికి అనేక మంది బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. ఈ క్రమంలో, పేద వారి బ్యాంకు ఖాతాలను కూడా వదల్లేదు నల్ల కుబేరులు. సామాన్యుల జన్ ధన్ ఖాతాల్లోకి సైతం తమ డబ్బును డిపాజిట్ చేయించారు. ఈ నేపథ్యంలో, బ్యాంకు అకౌంట్లలోకి పెద్ద మొత్తంలో జ‌మ అయిన నల్లధనంపై ఐటీ శాఖ దృష్టిని సారించింది. అనుమానాస్పద లావాదేవీలు - పరిమితికి మించి డబ్బు జమ కావడంలాంటివి జరిగిన అకౌంట్లను పరిశీలిస్తోంది. డిసెంబ‌రు 30 త‌రువాత దాడుల వేగం పెంచ‌డానికి రెడీ అవుతోంది. ఢిల్లీలో పలు వ్యాపార సంస్థలు - నిపుణులు - చార్టెడ్ అకౌంటెంట్లతో స‌మావేశ‌మైన ఐటీ శాఖ కమిషనర్ ఏకే చౌహాన్ ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు.

అకౌంట్లోలకి లెక్కల్లో చూపని డబ్బును జమ చేసిన వారు... ఇప్పటికైనా 'ప్రధాన మంత్రి గ్రామీణ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై)' కింద పన్ను చెల్లించాలని సూచించారు. గడుపు పూర్తయిన తర్వాత తమ విచారణలో ఎవరైనా బయటపడితే... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్థిక ఇంటెలిజెన్స్, ఇతర సంస్థలు ఇస్తున్న డేటాను పూర్తిగా పరిశీలిస్తున్నామని.... నల్లకుబేరులు ప‌ని ఖ‌త‌మ్ అని అన్నారు. పీఎంజేకేవై పథకం గడువు ముగియక ముందే పన్నులు చెల్లించాలని... ఒకసారి గడువు ముగిస్తే పన్ను ఎగవేతదారులకు కష్టాలు తప్పవని చౌహాన్ హెచ్చరించారు. పీఎంజీకేవై అనేది ఆదాయ వెల్లడి పథకం పార్ట్-2 కాదని... ఈ పథకం ఉద్దేశాలే వేరని చెప్పారు.

చౌహాన్ వ్యాఖ్య‌ల‌తో న‌ల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ప్ర‌భుత్వం వెంటాడుతోంద‌ని.. ఎలాగైనా త‌ప్పించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఈ పరుగు పందెంలో ఎవ‌రు గెలుస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/