Begin typing your search above and press return to search.

మ‌రో డిఫ్యూటీ సీఎంకు షాకిచ్చిన ఐటీ శాఖ‌

By:  Tupaki Desk   |   19 Jun 2017 4:52 PM GMT
మ‌రో డిఫ్యూటీ సీఎంకు షాకిచ్చిన ఐటీ శాఖ‌
X
దేశ రాజ‌కీయాల్లో ఎప్పుడూ లేని కొత్త సీన్ ఒక‌టి త‌ర‌చూ తెర మీద‌కు వ‌స్తోంది. ఒకేలాంటి దృశ్యం ఆవిష్కృత‌మ‌వుతున్నా.. పాత్ర‌ధారులు మాత్రం ఎప్ప‌టికిప్పుడు మారిపోతున్నారు. విప‌క్షంలో ఉన్న నేత‌లు త‌ర‌చూ విచార‌ణను ఎదుర్కోవాల్సి రావ‌టం ఉండేది. మోడీ స‌ర్కారు కేంద్రంలో కొలువు తీరిన నాటి నుంచి సీన్ మొత్తంగా మారిపోయింది.

గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో కేంద్ర విచార‌ణ సంస్థ అయిన సీబీఐ.. కేంద్ర ఆదాయ‌ప‌న్ను శాఖ అయిన ఐటీ మ‌హా యాక్టివ్‌గా త‌యార‌య్యాయి. అధికారానికి అణిగిమ‌ణిగి ఉంటూ.. వారు చెప్పిన‌ట్లుగా వింటార‌న్న ఆరోప‌ణ‌లున్న ఈ రెండు సంస్థ‌లు ఇప్పుడు స్వ‌తంత్ర్యంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వీర‌భ‌ద్ర సింగ్ కావొచ్చు.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ సీఎంవో.. త‌మిళ‌నాడు సీఎస్.. తాజాగా త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి సైతం అడ్డంగా బుక్ అవుతున్న వైనాలు ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా తెర మీద‌కు వ‌స్తున్నాయి. తాజాగా బీహార్ అధికార‌ప‌క్షానికి కేంద్ర ఐటీశాఖ దిమ్మ తిరిగే షాకిచ్చింది.

అధికార‌ప‌క్ష రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా బీహార్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రామ్ నాథ్‌ ను ప్ర‌క‌టించిన రోజునే.. అదేరాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎం తేజ‌స్వీ యాద‌వ్ తో పాటు.. ఆర్జేడీ అధినేత‌.. బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వంలో కీల‌క భూమిక పోషిస్తున్న లాలూ కుమార్తె మీసా భార‌తిల ఆస్తుల్ని ఆదాయ శాఖ సీజ్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఈ విష‌యంలో ఎవ‌రేం చెప్పినా అధికారులు లైట్ తీసుకుంటున్న వైనంతో లాలూ ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చేతిలో అంతులేని ప‌వ‌ర్ ఉన్న‌ప్ప‌టికీ ఏమీ చేయ‌లేక‌.. చేష్ట‌లూడిగిన‌ట్లుగా ఉండ‌టం లాలూకు ఇప్ప‌టివ‌ర‌కూ ఎదురుకాని అనుభ‌వంగా చెబుతున్నారు. బినామీ ఆస్తుల విష‌యంపై ఆరోణ‌లు ఎదుర్కొంటున్న మీసా భార‌తికి రెండుసార్లు స‌మ‌న్లు ఇచ్చినా లైట్ తీసుకోవ‌టంతో తాజాగా దాడులు నిర్వ‌హించారు. ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు ఇలాంటివి చోటు చేసుకోవ‌టం లాలూ లాంటి నేత‌కు అర్థం కావ‌టానికి కాస్త స‌మ‌యం ప‌డుతుందేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/