Begin typing your search above and press return to search.
ఐటీ ఉద్యోగులు.. శ్రీ మూకాంబిక ఇన్ఫో సొల్యూషన్స్ గురించి తెలుసుకోవాల్సిందే
By: Tupaki Desk | 6 May 2022 5:00 AM GMTఉద్యోగం చేస్తే గూగుల్.. ఫేస్ బుక్ లాంటి దిగ్గజ కంపెనీల్లో చేయాలని చాలామంది కోరుకుంటారు. ఎందుకంటే కళ్లు చెదిరే జీతాలు మాత్రమే కాదు.. ఇంటి అల్లుళ్లను చూసుకున్నంత చక్కగా ఉద్యోగుల్ని చూసుకోవటమే కాదు.. వసతుల విషయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేస్తాయి. అందుకే ప్రపంచంలో ఎక్కువ మంది ఈ కంపెనీలో ఉద్యోగం చేయటానికి తెగ ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు.
అయితే.. ఉద్యోగుల కోసం ఈ కంపెనీలు కూడా చేయలేని పనుల్ని తమిళనాడులోని మధురై కేంద్రంగా పని చేసే శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ అనే ఐటీ సంస్థ చేస్తుందని చెబుతున్నారు. తమ వద్ద పని చేసే ఉద్యోగుల కోసం ఈ సంస్థ చేసే పనుల గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
ఈ సంస్థ గురించి ఐటీ ఉద్యోగులు తెలుసుకుంటే.. వావ్.. తాము పని చేసే కంపెనీల్లోనూ ఇలాంటివి ఉంటే ఎంత బాగుండదన్న భావన కలుగక మానదు. ప్రస్తుతం 750 మంది ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ వార్షిక ఆదాయం రూ.100కోట్ల చేరువలో ఉంది. కానీ.. ఉద్యోగులకు కల్పించే వసతులతో పాటు.. తమ ఉద్యోగుల గురించి ఆలోచించే విషయంలో మిగిలిన కంపెనీలకు భిన్నంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు.
2006లొ శివకాశీలో స్టార్ట్ చేసిన ఈ సాఫ్ట్ వేర్ కంపెనీని 2010లో మధురైకి మారచారు. ఈ కంపెనీలో పని చేసే ఉద్యోగుల్లో 40 శాతం వరకు గడిచిన ఐదేళ్లుగా పని చేస్తున్నారు. సాధారణంగా ఐటీ కంపెనీల్లో రెండు మూడేళ్లకు మారిపోతుంటారు. మహా అయితే నాలుగేళ్లు. ఐదో ఏడు వచ్చేసరికి మాత్రం మారిపోతుంటారు. అందుకుభిన్నంగా ఈ కంపెనీలో మాత్రం ఉద్యోగాల నుంచి మారేందుకు ఆసక్తి చూపించరని చెబుతున్నారు. దీనికి కారణం.. ఉద్యోగుల విషయం కంపెనీ అనుసరించే విధానమే.
తమ వద్ద పని చేసే ఉద్యోగులకు ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఫ్రీగా పెళ్లి సంబంధాలు చూడటమే కాదు.. వారికి ఇంక్రిమెంట్లను అందిస్తుంటారు. కంపెనీ ఉద్యోగులందరికి ప్రతి ఆర్నెల్లకు ఆరు నుంచి 8 శాతం వరకు ఇంక్రిమెంట్లు.. పనితీరుకు అనుగుణంగా టాప్ 40 కానీ టాప్ 80 మంది ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్ ఇస్తుంటారు.
ఇలా తమ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ సంస్థ ఆలోచించినట్లుగా మరెవరూ ఆలోచించరన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఇలా ఆలోచించి.. అమలు చేస్తున్న కంపెనీలు ఉండొచ్చు. అవి పాపులర్ కాకపోవచ్చు.. శ్రీ మూకాంబిక ఇన్ఫోసొల్యూషన్స్ మాదిరి. అవును కదా?