Begin typing your search above and press return to search.
వచ్చే ఏడాది ఐటీలో అన్నీ గుడ్ న్యూస్ లేనట
By: Tupaki Desk | 25 Sep 2017 5:45 AM GMTఇటీవలి కాలంలో దుర్వార్తలకు - షాకింగ్ న్యూస్ లకు పరిమితం అయిపోయిన యువత కలల కెరీర్ పరిశ్రమ ఐటీ...వచ్చే ఏడాదిలో తీపికబుర్లు చెప్పనుందట. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2018-19) దేశీయ ఐటీ ఇండస్ట్రీ పనితీరు మళ్లీ పుంజుకోవచ్చని నాస్కామ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదుపాయాలు సమకూర్చుకునేందుకు ఆర్థిక సేవల రంగ సంస్థల నిధుల కేటాయింపులు పెరుగుతుండటంతోపాటు అమెరికా క్లయింట్ల డిమాండ్ కూడా పునరుద్ధరణ బాటపట్టిందంటున్న నాస్కామ్.. ఇండస్ట్రీ పనితీరు మెరుగుపడేందుకు ఈ పరిణామాలు దోహదపడనున్నాయని అంటోంది.
నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ ఐటీ పరిశ్రమపై మీడియాతో విశ్లేషిస్తూ...``15వేల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకున్న భారత ఐటీ ఇండస్ట్రీ ప్రస్తుతం మందగమనంలో కొనసాగుతోంది. అయితే, ఇండస్ట్రీ భవిష్యత్ పై సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగా ఉండవచ్చు`` అని తెలిపారు. ఐటీ కంపెనీలు కూడా మార్కెట్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యాపార వ్యూహాన్ని మార్చుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యాపార వృద్ధి వ్యూహాల్లో భాగంగా ఉద్యోగులకు కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వడంపైనా సంస్థలు దృష్టిసారించాయన్నారు. ఈ ప్రయత్నాలన్నీ వచ్చే ఏడాదిలో సానుకూల ఫలితాలందించగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ (2017-18) ఐటీ ఇండస్ట్రీ.. అసోసియేషన్ అంచనాల మేరకు వృద్ధి చెందగలదని నమ్మకం వ్యక్తం చేశారు. ఈసారి ఐటీ ఎగుమతులు 7-8 శాతం వృద్ధిని నమోదు చేసుకోవచ్చని, దేశీయంగా వ్యాపారం 10-11 శాతం వృద్ధి చెందవచ్చని జూన్ లో నాస్కామ్ అంచనాలను విడుదల చేసింది.
అమెరికా - బ్రిటన్ తో పాటు సింగపూర్ - ఆస్ట్రేలియా - న్యూజీలాండ్ దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కారణంగా ఐటీ వ్యయాలు తగ్గడంతో భారత సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీపై ఒత్తిడి పెరిగింది. దీంతో ఈ ఏడాదంతా నిరాశలే కమ్ముకున్న సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా ప్రకటించిన లేఆఫ్ ల కారణంగా ఎందరో రోడ్డున పడ్డారు. అయితే తాజా అంచనాల నేపథ్యంలో అలాంటి షాకులు ఉండవని ఆకాంక్షిస్తున్నారు.