Begin typing your search above and press return to search.
ఐటీ గ్రిడ్ మీద ఆధార్ కూడా కేసు పెట్టమంది
By: Tupaki Desk | 13 April 2019 5:31 AM GMTఆ మధ్యన డేటా చౌర్యం వ్యవహారంలో ఐటీ గ్రిడ్ కంపెనీ ఎపిసోడ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ కావటం తెలిసిందే. ఆధార్ కేంద్ర కార్యాలయంలోనూ.. కేంద్ర ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత.. కీలక సమాచారం ఐటీ గ్రిడ్ సర్వర్లలో ఉండటంపై సదరు కంపెనీ ప్రతినిధులపై కేసులు నమోదు చేసిన వైనం తెలిసిందే.
ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించటానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఐటీ గ్రిడ్ కార్యాలయంలో ఆధార్ సమాచారం దొరకటంపై వివరణ కోరుతూ సిట్ అధికారులు ఆధార్ కేంద్ర కార్యాలయానికి లేఖ రాశారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు.
దీనిపై స్పందించిన ఆధార్ అధికారులు హైదరాబాద్ లోని రీజినల్ కార్యాలయం ద్వారా మాదాపూర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో.. స్పందించిన పోలీసులు ఆధార్ కార్డు యాక్ట్ లోని 37.. 38.. 40.. 42.. 44 సెక్షన్ల కిందట కేసు నమోదు చేశారు. ఆ వెంటనే ఈ కేసును కూడా సిట్ కు బదిలీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిన వేళ.. ఐటీ గ్రిడ్ మీద తాజాగా పెట్టిన కేసు కొత్త కలకలాన్ని రేపుతుందని చెప్పక తప్పదు.