Begin typing your search above and press return to search.

మ‌మ్మ‌ల్ని నిర్బంధించ‌లేదు..జ‌స్ట్ నోటీసులు ఇచ్చారంతే!

By:  Tupaki Desk   |   4 March 2019 10:42 AM GMT
మ‌మ్మ‌ల్ని నిర్బంధించ‌లేదు..జ‌స్ట్ నోటీసులు ఇచ్చారంతే!
X
డేటా చౌర్యంతో పాటు.. ఏపీలో పెద్ద ఎత్తున ఓట్ల‌ను తొల‌గించేందుకు కుట్ర జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌ల‌తో మాదాపూర్ అయ్య‌ప్ప సొసైటీకి చెందిన ఐటీ గ్రిడ్స్ సంస్థ‌లో తెలంగాణ సైబ‌ర్ పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మ సంస్థ‌కు చెందిన న‌లుగురు ఉద్యోగుల్ని తెలంగాణ పోలీసులు అక్ర‌మంగా నిర్బందించారంటూ స‌ద‌రు సంస్థ డైరెక్ట‌ర్ అశోక్ ఒక పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

తాజాగా ఈ పిటిష‌న్ ను హైకోర్టు న్యాయ‌మూర్తి నివాసంలో జ‌స్టిస్ ఆర్ ఎస్ చౌహాన్.. జ‌స్టిస్ ష‌మీమ్ అక్త‌ర్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తాజాగా విచారించింది. ఈ సంద‌ర్భంగా ఐటీ గ్రిడ్స్ కు చోందిన న‌లుగురు ఉద్యోగులు(రేగొండ భాస్కర్‌ - ఫణి కడులూరి - గురుడు చంద్రశేఖర్‌ - విక్రమ్‌ గౌడ్‌ రెబ్బాల) తెలంగాణ పోలీసులు త‌మ‌ను అక్ర‌మంగా నిర్బందించ‌లేద‌ని.. కేవ‌లం నోటీసులు మాత్ర‌మే ఇచ్చిన‌ట్లుగా చెప్పారు. పోలీసుల త‌ర‌ఫున అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వాద‌న‌లు వినిపిస్తూ.. ఉద్యోగుల్ని తాము అదుపులోకి తీసుకోలేద‌ని.. కేవ‌లం నోటీసులు ఇచ్చామ‌ని.. వారిని అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌న్న వాద‌న స‌రికాద‌న్నారు.

ఇదే విష‌యాన్ని స‌ద‌రు ఉద్యోగులు కూడా వెల్ల‌డించ‌టంతో.. సంస్థ డైరెక్ట‌ర్ అశోక్ దాఖ‌లు చేసిన హెబియ‌స్ కార్ప‌స్ పిటిష‌న్ ను కొట్టి వేస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. అంతేకాదు.. ఆ న‌లుగురు ఐటీ ఉద్యోగుల‌కు స్వేచ్ఛ క‌ల్పించాల‌ని చెప్పింది. సంస్థ ఉద్యోగుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోకున్నా.. తీసుకున్న‌ట్లుగా.. అక్ర‌మంగా నిర్బందించిన‌ట్లుగా సంస్థ డైరెక్ట‌ర్ ఎందుకు ఫిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు..?