Begin typing your search above and press return to search.
ఎవరున్నా వదలం... ఐటీగ్రిడ్ లో దూకుడే
By: Tupaki Desk | 4 March 2019 12:55 PM GMTడాటా చౌర్యం కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా, ఐటీగ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్థ కేసులో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో ఆ సంస్థ ఉద్యోగుల కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ...``లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్ లో సోదాలు చేశాం. ఆ సమయంలో కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు కూడా ఉన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజల వ్యక్తిగత, సునిశిత సమాచారాన్ని భద్రపరిచినట్లు గుర్తించాం. దీనికి సంబంధించి సంస్థ ఉద్యోగులు నలుగురిని రెండ్రోజుల పాటు విచారించాం. ఐటీగ్రిడ్ కార్యాలయంలో ల్యాప్ టాప్, హార్డ్ డిస్క్ లు పత్రాలు స్వాధీనం చేసుకున్నాం. ఐటీ గ్రిడ్ సంస్థ కేసులో అమెజాన్ సంస్థకు నోటీసులు ఇచ్చాం. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకి లేఖ రాశాం. ఓట్ల తొలగింపుపై ఏపీలో 50 కేసుల వరకు నమోదయ్యాయి`` అని వెల్లడించారు.
ఐటీ గ్రిడ్స్ సంస్థ పై విచారణ కొనసాగుతోందని.. కీలక ఆధారాలు సేకరించామని, `ఐటీ గ్రిడ్స్' కేసులో ఎంత పెద్దలున్నా వదిలిపేట్టే ప్రసక్తే లేదని సైబారబాద్ సీపీ సజ్జనార్ స్పష్టంచేశారు. 'సేవా మిత్ర' యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తేలిందని ఆయన చెప్పారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ ఐడీ, ఆధార్ కార్డుల సమాచారాన్ని కూడా సేకరించారన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ దగ్గర ఏపీ ప్రజల ఆధార్, ఓటర్ కార్డ్, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారి కులాల వివరాలు ఉన్నాయని..వాటిని ఎందుకు సేకరించారు? ఎలా సేకరించారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ కేసులో ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్ ని ప్రధాన నిందితుడిగా గుర్తించామని..తన వద్ద ఉన్న డేటాతో లొంగిపోవాలని ఆయన కోరారు. అశోక్ కోసం ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో గాలింపు సాగుతోందని, ఆయన పొరుగు రాష్ట్రంలో ఉన్నా పట్టుకుని తీరుతామన్నారు.
ఐటీ గ్రిడ్స్ సేకరించిన సమాచారాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని.. అవసరమైన పక్షంలో ఈ కేసులో అరెస్టులు కూడా ఉంటాయని సజ్జనార్ స్పష్టం చేశారు. ఓటర్ లిస్టు నుంచి ఓట్లను తొలగిస్తున్నట్టు కొందరు ఓటర్లు ఫిర్యాదు కూడా చేశారని.. ఇందుకు సంబంధించి ఏపీలో దాదాపు 50 కేసులు కూడా నమోదయ్యయని సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుంచే డేటా చోరీ అయినందున.. తెలంగాణ పోలీసులే కేసును దర్యాప్తు చేస్తారని స్పష్టంచేశారని.. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ, ఈసీకి లేఖ రాశామని సజ్జనార్ తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వేసెస్ కు నోటీసులు జారీ చేశామని, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు. నిందితుడు అశోక్ సరెండర్ కావాలని కోరుతున్నామన్నారు.