Begin typing your search above and press return to search.
హామీల్ని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు.. గెలిస్తే ఆ ఐదు ఫ్రీ
By: Tupaki Desk | 21 Feb 2021 5:30 AM GMTఅవి ఎలాంటి ఎన్నికలైనా కానీ.. తమను ఎన్నుకుంటే అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పటం కామన్. నోటిమాట నీళ్ల మూటతో సమానమన్న విమర్శ ఉన్నా.. ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడల్లా తమను గెలిపిస్తే.. చేసే పనుల చిట్టా గురించి చెప్పటం అలవాటే. అయితే.. ఇందుకు భిన్నంగా వ్యవహరించాడో నేత. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేస్తునన నేత ఒకరు.. తమ వర్గాన్ని గెలిపిస్తే తానేం చేయనున్న విషయాన్ని నోటి మాటగా కాకుండా.. నోటరీ చేయించిన బాండ్ పేపర్ మీద రాసివ్వటం ఆసక్తికరంగా మారింది.
ఈ ఉదంతం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో చోటు చేసుకుంది. ఇక్కడ మూడో వార్డు నుంచి పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి.. తమ వర్గాన్ని గెలిపించాలని కోరుతున్నాడు. అలా ప్రజలు తమ టీంను గెలిపిస్తే.. రానున్న ఐదేళ్లలో తానేం చేయనున్న విషయాన్ని రూ.20 స్టాంపు పేపర్ మీద రాయించాడు. అనంతరం దాన్ని నోటరీ చేయించాడు. అలాంటివి మొత్తం 14 సెట్లు చేయించిన అతను.. తమ గ్రామంలోని పద్నాలుగు వార్డుల్లోని పెద్ద మనుషుల్ని కలిసి.. వారి చేతిలో బాండ్ పేపర్ ను పెట్టాడు.
ఈ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. గెలిచినంతనే తానేం చేస్తానన్న విషయాన్ని.. రానున్న ఏడాది పాటు తాను చేసే పనుల చిట్టాను ఏకరువు పెట్టాడు. ఇంతకూ ఆయన ఇచ్చిన హామీలు ఏమిటన్నది మరింత ఆసక్తికరంగా మారింది. తానిచ్చే వరాల్ని ఎంత క్లియర్ గా పేర్కొన్నాడంటే..
1. మార్చి 1 - 2021 నుంచి ఫిబ్రవరి 28 - 2022 వరకు గ్రామంలోని వారందరికి ఉచితంగా కేబుల్ టీవీ
2. ఏడాది పాటు గ్రామంలో ప్రజలు తీసుకునే రేషన్ పూర్తిగా ఉచితం
3. గ్రామ ప్రజలు వినియోగించే మినరల్ వాటర్ ను వాటర్ ప్లాంట్ లో ఉచితంగా ఇస్తాం
4. గ్రామంలోని వారికి ఉచితంగా బీపీ.. షుగర్ టెస్టులు
5. ఊళ్లోని హైస్కూల్లో పది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున ఆర్థికసాయం
6. 2022-2023 ఏడాదికి ఇంటి పన్నులు.. నీటి కుళాయి పన్నుల రద్దు చేయించటానికి ప్రయత్నం.
మొత్తం ఆరు హామీల్లో.. ఆరోది తప్పించి మిగిలిన ఐదు హామీలు నేరుగా.. ఏడాది పాటు అమలు చేసేలా హామీ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఈ పంచాయితీకి ఈ రోజు (ఆదివారం - ఫిబ్రవరి 21న) ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదంతా ప్రచారం కోసం అనుకుంటేతప్పులో కాలేసినట్లే.. ఈ బాండ్ పేపర్ తయారు చేయించిన నాయకుడు.. స్థానికంగా ఒక లాయర్ ను పెట్టుకొని మరీ ఇదంతా చేయటంతో ఆయన్ను గ్రామస్తులు ఎన్నుకుంటారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరేం జరుగుతుందో చూడాలి.