Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ పై న్యాయ‌పోరాట‌మే.. బాబు నిర్ణ‌యం ఇదే!

By:  Tupaki Desk   |   28 July 2021 9:45 AM GMT
జ‌గ‌న్‌ పై న్యాయ‌పోరాట‌మే.. బాబు నిర్ణ‌యం ఇదే!
X
టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై.. కృష్నాజిల్లా పోలీసులు పెట్టిన హ‌త్యాయ‌త్నం(అటెంప్టివ్ మ‌ర్డ‌ర్‌), ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు.. స‌హా ప‌లు సెక్ష‌న్లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణల నిజనిర్ధరణకు వెళ్లిన దేవినేని ఉమాపై వైసీపీ వర్గీయులు రాళ్ల దాడి చేస్తే.. ఈ క్ర‌మంలో ఆయ‌న కారులోనే ఉన్నారు. బ‌య‌ట‌కు దిగితే అరెస్టు చేస్తామ‌ని.. పోలీసులు కూడా హెచ్చ‌రించారు.

దీంతో కారులోనే కూర్చున్న ఉమాపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేయ‌డం ఏంటి? ఆయ‌న‌పై ఎస్సీ కేసు పెట్ట‌డం ఏంటి? ఇవీ.. ఇప్పుడు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆలోచ‌న‌ల‌కు గురిచేస్తున్న విష‌యాలు. అంతేకాదు.. పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో వాహనం ధ్వంసంతోపాటు... పలువురు గాయపడేందుకు కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలని కోరుతూ.. వాహనంలోనే ఉమా నిరసనకు దిగారు. కారు అద్దం పగులగొట్టిమరీ పోలీసులు ఉమాను అరెస్టు చేసిన పోలీసులు.. ఆయ‌న ఎవ‌రినో హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని చెబుతున్నారు.

ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. హ‌త్య చేసేందుకు వ‌చ్చిన వ్య‌క్తి.. కారులో ద‌ర్జాగా ఎలా కూర్చుంటాడ‌నేది.. టీడీపీ నేత‌లు సంధిస్తున్న ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దేవినేని ఉమాపై.. అట్రాసిటీ, 307(హ‌త్యాయ‌త్నం) సెక్షన్లు కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని హత్యాయత్నానికి పాల్పడినట్లు.. 307 సెక్షన్‌ కింద అభియోగాలు మోపారు. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్ర‌బాబు హుటాహుటిన పార్టీ సీనియ‌ర్ల‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వం తీరును, వైసీపీ నేతల వైఖరిని.. చివరికి పోలీసుల వ్యవహారశైలిని సైతం తీవ్రంగా తప్పుబట్టారు.

ఉమాపై కేసు నమోదు చేయడాన్ని అధినేత చంద్రబాబు సహా పార్టీ నేతలంతా ఖండించారు.ఈ క్ర‌మంలో త‌క్ష‌ణం న్యాయ పోరాటానికి దిగాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. అంతేకాదు.. దేవినేనికి అండ‌గా.. త్రిస‌భ్య బృందాన్ని రంగంలోకి దించి.. అస‌లు ఏం జ‌రిగింది.. ? జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎందుకు రాజ‌కీయ కుట్ర‌ల‌కు పాల్ప‌డుతోంద‌నే విష‌యంపై ప్ర‌జ‌ల‌కు వివ‌రించేలా.. చంద్ర‌బాబు వ్యూహం సిద్ధం చేసుకున్నారు. అదేస‌మ‌యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు, రాస్తారోకోలు, నిర‌స‌న‌ల‌కు పిలుపునివ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టితో.. జ‌రిగిన దానిని చూస్తూ.. ఊరుకుంటే...రేపు మరోనేత‌పైనా ఇలానే చేస్తార‌ని.. చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌ను ఇంటా బ‌య‌టా ఏకేలా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు