Begin typing your search above and press return to search.

థర్డ్ వేవ్ వస్తే తట్టుకోవడం కష్టమే .. రెండు రోజుల్లోనే .. !

By:  Tupaki Desk   |   20 May 2021 2:30 AM GMT
థర్డ్ వేవ్ వస్తే తట్టుకోవడం కష్టమే .. రెండు రోజుల్లోనే .. !
X
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. లక్షల్లో కేసులు , వేలకొద్ది మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే దేశంలో ఎన్నో రకాల వేరియంట్లు వెలుగులోకి వస్తున్నాయి. వీటిలో బాగా చర్చకు వచ్చిన వైరస్ ఏపీలో కనిపించి కరోనా వేరియంట్. ఇది మామూలు వైరస్ కన్నా 15 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే ఇది చాలా తక్కువ ప్రాంతాల్లోనే ప్రస్తుతానికి పరిమితమైంది. ఈ వేరియంట్లు కరోనా కొత్త స్ట్రెయిన్లను సృష్టిస్తున్నాయని వైద్యులు చేసిన పరిశోధనలో తేలిందని ప్రచారం జరుగుతోంది. ఇలా జరగడం వల్ల రకరకాల విధానాల్లో మానవులను ఈ వైరస్ ఎటాక్ చేస్తోందని వైద్యులు చెప్పారు. ఎన్ని రకాల కొత్త వేరియంట్స్ ఉండటం వల్ల కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత కరోనా థర్డ్ వేవ్ తప్పదని చెప్తున్నారు.

కరోనా మొదటి వేవ్‌ లో మనుషుల ఊపిరితిత్తులను నాశనం చేయడానికి వైరస్ 10 రోజుల సమయం తీసుకుంది. సెకండ్ వేవ్‌ లో ఈ కాలం 5-7రోజులకు తగ్గిపోయింది. థర్డ్ వేవ్ కనుక వస్తే 2 నుంచి 3 రోజుల్లోనే ఊపిరితిత్తులను వైరస్ నాశనం చేసి, బాధితులను ఐసీయూలో పడేలా చేస్తుందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం, కరోనా వేవ్స్‌పై అధ్యయనం చేస్తున్న కొంత మంది శాస్త్రవేత్తలు మరో షాకింగ్ విషయం వెల్లడించారు. అదేంటంటే కరోనా మొదటి వేవ్‌ లో వృద్ధుల పై వైరస్ దాడి చేసింది.

సెకండ్ వేవ్‌ లో యువకులపై ఎక్కువ ప్రభావం పడింది. మూడో వేవ్ గనుక వస్తే ఇది పిల్లలను టార్గెట్ చేస్తుందనేది నిపుణులు చెప్తున్నారు. భారతదేశ జనాభాలో 18 ఏళ్లలోపు వారే 30 శాతంపైగా ఉన్నారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి వీరికి కూడా వ్యాక్సిన్ తీసుకొస్తామని సీరమ్ ఇన్‌ స్టిట్యూట్ చెప్తోంది. కోవ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్ కూడా ఈ పనిలోనే ఉంది. వారి వ్యాక్సిన్ ట్రయల్ దశలో ఉన్నట్లు సమాచారం. ప్రపంచంలో ఇప్పటి వరకూ ఫైజర్ కంపెనీ మాత్రమే 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ తయారు చేసింది. 12 ఏళ్లపైబడిన వారికి ఇవ్వొచ్చంటూ ఒక వ్యాక్సిన్ విడుదల చేసింది.